బ్రేకింగ్ : 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిందని, కోట్లాది మంది ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా 42 [more]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిందని, కోట్లాది మంది ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా 42 [more]

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిందని, కోట్లాది మంది ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారన్నారు. నాలుగు నెలలుగా కరోనా వైరస్ తో పోరాడుతున్నామని చెప్పారు. మానవ జాతికి ఇది సంక్షోభ సమయమన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తుందన్నారు. మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందేనన్నారు. కరోనాపై పోరాటంలో మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేరని మోదీ చెప్పారు. సంక్షోభం కంటే మన సంకల్పం ముఖ్యమని మోదీ చెప్పారు. 21వ శతాబ్దం భారతీయులదేనన్నారు.
కీలక దశలో ఉన్నాం….
ఇలాంటి సంక్షోభాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని మోదీ చెప్పారు. స్వీయ రక్షణ పాటిస్తూ ముందుకెళ్లాల్సిందేనన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు కరోనా నుంచి కాపాడగలవన్నారు. కరోనా వైరస్ ప్రారంభంలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్ ల ఉత్పత్తి భారత్ లో ఉండేది కాదన్నారు. ఇప్పుడు రోజుకు రెండు లక్షల కిట్లు ఉత్పత్తి చేయగలుతున్నామన్నారు. యావత్ ప్రపంచానికి భారత్ మార్గదర్శనం చేస్తుందన్నారు మోదీ. అనేక వైరస్ ల నుంచి భారత్ తమను తాము కాపాడుకోగలిగిందన్నారు. ఇది ప్రజల సంకల్పంతోనే సాధ్యమయిందన్నారు. ప్రస్తుతం కరోనా విషయంలో కీలక దశలో ఉన్నామన్నారు.
ఏ కష్టాన్నైనా సంకల్పంతో…
జీవన్మరణ యుద్ధంలో భారత్ ఔషధాలు ప్రపంచానికే ఆశాకిరణాలుగా మారాయన్నారు. ప్రపంచానికి యోగాను భారత్ కానుకగా ఇచ్చిందన్నారు మోదీ. భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం నమ్ముతుందన్నారు. విపత్తును అవకాశంగా భారత్ మలుచుకుందన్నారు. భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందన్నారు. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చన్నారు. ఏ కష్టాన్నైనా సంకల్పంతో అధిగమించ వచ్చన్నారు. భారత్ అభివృద్ధి పయనం మళ్లీ మొదలయిందన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ప్రజాస్వామ్యం, డిమాండ్ భారత్ కు మూలస్థంభాల్లాంటివన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ మన లక్ష్యమన్నారు.
20 లక్షల కోట్ల ప్యాకేజీ….
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నానన్నారు. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నానన్నారు. ఈ ప్యాకేజీ 2020లో భారత్ కు ఎంతో ఉపకరిస్తుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీకి ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక మంత్రి త్వరలోనే దీనిని సమగ్రంగా వివరిస్తారని మోదీ చెప్పారు. పేదలు, రైతులకు ఉపయోగపడేలా ఈ ప్యాకేజీ ఉంటుందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వడం కోసమే ఈ ప్యాకేజీ అని చెప్పారు. దేశ జీడీపీలో పదిశాతంతో ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు మోదీ చెప్పారు.

