తండ్రికి తెలిసా…? తెలియకుండానా..??
పార్టీ ఒకటే.. నేతలు కూడా ఒకరే .. కానీ, హామీలు వేరు. మాటలు వేరు! దీంతో పార్టీ ఇబ్బంది పడుతోంది. కేడర్ మరింతగా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో [more]
పార్టీ ఒకటే.. నేతలు కూడా ఒకరే .. కానీ, హామీలు వేరు. మాటలు వేరు! దీంతో పార్టీ ఇబ్బంది పడుతోంది. కేడర్ మరింతగా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో [more]

పార్టీ ఒకటే.. నేతలు కూడా ఒకరే .. కానీ, హామీలు వేరు. మాటలు వేరు! దీంతో పార్టీ ఇబ్బంది పడుతోంది. కేడర్ మరింతగా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ఇలా అయితే ఎలా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఎన్ని కలకు ఇంకా కొంత మేరకు సమయం ఉన్నా.. అన్ని పార్టీల్లోనూ నాయకులు టికెట్ల వేటలో పడ్డారు. ఎవరికివారే.. టికెట్లు తమ కు కావాలని పోటీ పడుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కూడా పోటీ పడుతున్నా రు. దీంతో పోటీ తీవ్రంగా ఉంటోంది. అయితే, వైసీపీని తీసుకుంటే.. ఇక్కడ టికెట్ల కేటాయింపు ఒకే చేతిమీదుగా జరుగు తోంది. కేవలం జగన్ ఆశీస్సులు ఉన్న నాయకుడికే టికెట్ లభిస్తుంది. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది.
లోకేష్ ప్రమేయం…..
అయితే, అధికార పార్టీ టీడీపీ విషయానికి వచ్చే సరికి మాత్రం రెండు రాజకీయ కేంద్రాలు కనిపిస్తున్నాయని అంటున్నా రు తమ్ముళ్లు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఉన్నారు. అదేసమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన తనయుడు నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఇది పార్టీలో టికెట్ల కేటాయింపు వరకు కూడా వెళ్లడంతో కొంత మేరకు గందరగోళం ఏర్పడుతోంది. అంటే.. చంద్రబాబు వ్యూహం ప్రకారం ఒక నియోజకవర్గంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే, లోకేష్ స్థానిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా.. ఎవరు ఎక్కువ హడావుడి చేస్తే.. వారికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికీ చిచ్చుగానే….
ఈ పరిణామం టీడీపీలో ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికే కర్నూలులో కర్నూలు అసెంబ్లీ టికెట్‌ను లోకేష్ అక్కడిక క్కడే ప్రకటించారు. అయితే, అప్పటికే దీనిపై ఆశలు పెట్టుకున్న నాయకుల పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే వ్యవహరించారు. ఇది ఇప్పటికీ చిచ్చుగానే ఉంది. ఇక, ఇలాగే శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో అక్కడికక్కడే ఓ మహిళకు టికెట్ ప్రకటించారు లోకేష్. వాస్తవానికి టీడీపీలో టికెట్ల ప్రకటన అనేది అధినేత చంద్రబాబు మరో ఇద్దరుకీలక నాయకులతో కూర్చుని మాట్లాడి టికెట్లను ఖరారు చేస్తారు. కానీ, ఈ సంప్రదాయం తెలిసో తెలియకో లోకేష్ ఒకలాగా.. చంద్రబాబు మరోలాగా వ్యవహరిస్తున్నారు.
రాయచోటి విషయంలోనూ….
తాజాగా ఇదే విషయంపై కడప జిల్లా రాయచోటిలోనూ గందరగోళం ఏర్పడింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి చంద్రబాబు అభయం ఇచ్చారు. అయితే, దీనికంటే ముందుగానే.. మాజీ ఎంపీ పాలకొండ్రాయుడి తనయుడు ప్రసాద్‌బాబు తనకు లోకేష్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. సో.. టీడీపీలో టికెట్ల పరిస్థితి ఇలా ఉంది. మరి బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- nara lokesh
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- నారా à°²à±à°à±à°·à±â
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±