నిజంగానే “పులివెందుల” పంచాయతి
కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే ఆయన గత ఎన్నికల నుంచి చేస్తున్న వ్యాఖ్యలే కడప జిల్లాలో పార్టీని దెబ్బతీశాయంటున్నారు అక్కడి పార్టీ నేతలు. నియోజకవర్గాల వారీగా [more]
కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే ఆయన గత ఎన్నికల నుంచి చేస్తున్న వ్యాఖ్యలే కడప జిల్లాలో పార్టీని దెబ్బతీశాయంటున్నారు అక్కడి పార్టీ నేతలు. నియోజకవర్గాల వారీగా [more]

కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే ఆయన గత ఎన్నికల నుంచి చేస్తున్న వ్యాఖ్యలే కడప జిల్లాలో పార్టీని దెబ్బతీశాయంటున్నారు అక్కడి పార్టీ నేతలు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు కడప జిల్లా తెలుగు తమ్ముళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు జగన్ ను ఏదో విధంగా ఇరుకున పెట్టాలని ఎన్నికలకు ముందు ప్రయత్నించారు. అందులో ఒకటి పులివెందుల పంచాయతి.
పదే పదే అదే మాట….
జగన్ అధికారంలోకి వస్తే పులివెందుల పంచాయతీలు ఎక్కువవుతాయని, అంతేకాకుండా సీమ రౌడీలు మీఇళ్లల్లో దూరి ఆడపిల్లలను ఎత్తుకుపోతారని కూడా వ్యాఖ్యానించారు. ఆస్తులను కూడా కాజేస్తారని, అందుకే రౌడీ రాజ్యాన్ని రానివ్వ వద్దంటూ చంద్రబాబు ఎన్నికల ప్రతి ప్రచార సభలో గుక్కతిప్పుకోకుండా చెప్పేశారు. బహుశా ఆ ప్రభావమే కావచ్చు రాయలసీమ జిల్లాలోని కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. అనంతపురం లో రెండు, చిత్తూరులో ఒకటి మాత్రమే జనం ఇచ్చారు. అది కూడా చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ లు మాత్రమే గెలిచారు.
ఎన్నికలు పూర్తయినా….
ఇక ఎన్నికలు పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ చంద్రబాబు నోటి నుంచి పులివెందుల పంచాయతీ పదం పోలేదు. ఇప్పటికీ ప్రతి సభలో, ప్రతి సమీక్షలో పులివెందుల పంచాయతీని గుర్తుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కడప జిల్లాలో జరిపే సమీక్షల సమయంలో ఈ విషయం లేవనెత్తాలని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారట. పులివెందుల పంచాయతీ పదం ఒక్క కడప జిల్లాపైనే కాకుండా రాయలసీమ మొత్తం ప్రభావం చూపే అవకాశముందని చంద్రబాబు ఎదుటే స్పష్టం చేయదలచుకున్నట్లు సమాచారం.
ఆ పదమే వద్దంటున్న…..
ఈ నేపథ్యంలో కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న చంద్రబాబు కొంత ఇబ్బంది పడే అవకాశముంది. ఇప్పటికే జిల్లాలో పార్టీ అగ్రనేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డిలు టీడీపీని వీడారు. వారితో పాటు టీడీపీ క్యాడర్ కూడా బీజేపీ, వైసీపీల్లో చేరిపోతుంది. కడప లోని పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరి చంద్రబాబు క్యాడర్ లో ఎలా ధైర్యం నింపుతారో? నిజంగానే పులివెందుల పంచాయతీని ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

