“అనంత”లో బాబు భగీరథ యత్నమేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తర్వాత వరసగా ఆయన జిల్లాలను పర్యటిస్తున్నారు. నేతలను యాక్టివ్ మోడ్ లోకి తెచ్చేందుకు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తర్వాత వరసగా ఆయన జిల్లాలను పర్యటిస్తున్నారు. నేతలను యాక్టివ్ మోడ్ లోకి తెచ్చేందుకు [more]

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తర్వాత వరసగా ఆయన జిల్లాలను పర్యటిస్తున్నారు. నేతలను యాక్టివ్ మోడ్ లోకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ లో కూడా ఉత్సాహం నింపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలుండటంతో జిల్లాల పర్యటనలకు చంద్రబాబు గ్యాప్ ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన చంద్రబాబు తిరిగి అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతున్నారు.
షాకిచ్చిన సీమ….
నిజానికి గత ఎన్నికల్లో రాయలసీమ మొత్తం తెలుగుదేశం పార్టీకి షాకిచ్చింది. కర్నూలు, కడపలో ఒక్క స్థానం కూడా రాలేదు. చిత్తూరు లో కేవలం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మాత్రమే గెలిచింది. అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ లు మాత్రమే గెలుపొందారు. పేరుపొందిన నేతలు సయితం ఓటమి పాలయి పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు.
ఓటమిపాలయిన వారు….
తాడిపత్రి అసెంబ్లీ, అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసిన జేసీ కుటుంబం ఓటమి పాలయింది. ప్రస్తుతానికి జేసీ కుటుంబం టీడీపీలోనే ఉన్నా అధికార పార్టీ దెబ్బకు మౌనంగానే ఉంటుంది. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ మూసివేసే పరిస్థితి వచ్చింది. దీంతో జేసీ కుటుంబం జెండా పట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఈయనకు, జేసీ కుటుంబానికి మధ్య ఉన్న పొరపచ్చాలు కూడా పార్టీ ఎదుగుదలకు మైనస్ గా మారాయి.
జెండా పట్టుకునేందుకు కూడా…..
అనంతపురం జిల్లాలో మరో పవర్ ఫుల్లు ఫ్యామిలీ పరిటాల. ఈ ఎన్నికల్లో పరిటాల కుటుంబం నుంచి బరిలోకి దిగిన శ్రీరాం తొలి ప్రయత్నంలోనే ఓటమి చవి చూశారు. పరిటాల శ్రీరాం రాప్తాడుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి బీజేపీలో చేరిపోయారు. కాల్వ శ్రీనివాసులు అప్పుడప్పుడు మీడియాలో కన్పిస్తున్నారు. పల్లె రఘునాధరెడ్డి పత్తా లేకుండా పోయారు. ఇలా అనంతపురంలో పూర్తిగా డీలా పడిన నేతలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ఈ సమీక్షలో ప్రయత్నించాల్సి ఉంటుంది. భవిష్యత్తుపై భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో మకాం వేయనున్నారు. మరి అనంత నేతలు గాడిన పడతారో? లేదో? చూడాలి.

