టీడీపీలో ఆమె రాజకీయం ముగిసినట్టేనా..?
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలు కూడా మారుతున్నాయి. ఈ క్రమంలో పాత తరం నేతలను పక్కన పెడుతున్నా యి. దీంతో కొత్త నేతలు ముందుకు వస్తుండడంతో పాతవారు [more]
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలు కూడా మారుతున్నాయి. ఈ క్రమంలో పాత తరం నేతలను పక్కన పెడుతున్నా యి. దీంతో కొత్త నేతలు ముందుకు వస్తుండడంతో పాతవారు [more]

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలు కూడా మారుతున్నాయి. ఈ క్రమంలో పాత తరం నేతలను పక్కన పెడుతున్నా యి. దీంతో కొత్త నేతలు ముందుకు వస్తుండడంతో పాతవారు తెరమరుగు అవుతున్నారు. లేదా.. వారి వారి వారసులను రంగం లోకి దింపుతున్నారు. తాజాగా టీడీపీలో సీనియర్ నాయకురాలు.. పార్టీ ప్రారంభం నుంచి లేకపోయినా.. తర్వాత చేరినా.. పురుష నేతలతో సమానంగా చక్రం తిప్పిన.. మహిళా నాయకురాలు.. కమ్మ వర్గానికే చెందిన నన్నపనేని రాజకుమారి. దాదాపు మూడు న్నర దశాబ్దాల కిందటే.. నన్నపనేని రాజకుమారి రాజకీయాల్లో చక్రం తిప్పారు.
మూడు దశాబ్దాలుగా…
తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన నన్నపనేని రాజకుమారి క్షేత్రస్థాయి నుంచి ఎదిగారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ గెలిచినా కూడా వినుకొండ నుంచి ఆమె ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సత్తెనపల్లి నుంచి కూడా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ను వీడి.. టీడీపీలో చేరారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా.. మంచి గుర్తింపు పొందారు. తర్వాత నామినేటెడ్ పదవులు కూడా అలంకరించారు. ఎమ్మెల్సీగా చాలా కాలం పనిచేశారు. ఇక, తన వారసురాలిగా.. కుమార్తె సుధను రంగంలోకి దింపారు. 2014లో సుధ వైసీపీ తరఫున వినుకొండ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత సుధ మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. కానీ, నన్నపనేని రాజకుమారి మాత్రం గత చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా..వాలిపోయేవారనే పేరు తెచ్చుకున్నారు.
వయసు పైబడటంతో….
కలివిడి రాజకీయాలు చేయడంలోను నన్నపనేని రాజకుమారికి సాటి లేరు. అన్ని పార్టీల్లోనూ రాజకుమారికి అభిమానులు ఉన్నారు. వివాద రహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. మంచి వక్తగా, విషయ పరిశీలన ఉన్న నాయకురాలిగా కూడా నన్నపనేని రాజకుమారి వ్యవహరించారు. టీవీ చర్చల్లోనూ పార్టీ వాయిస్ వినిపించారు. అయితే, ఇప్పుడు ఆమె వయసు 70 సంవత్సరాలు. సో.. మరో నాలుగేళ్ల తర్వాతైనా.. ఇంటికి పరిమితం కావాల్సిందే. దీంతో నన్నపనేని రాజకుమారి రాజకీయాలు ఆమెతోనే ఫుల్ స్టాప్ పడిపోతాయా ? అనేది ఆసక్తికరం. ఆమెకు సుధతోపాటు రఘు కుమారుడు ఉన్నారు. కానీ, ఆయన ప్రస్థావన ఎక్కడా రాజకీయాల్లో మనకు కనిపించదు. సో.. మొత్తానికి నన్నపనేని.. ఓ వెలుగు వెలిగిన నాయకురాలిగా మిగిలిపోతారనే అనాలి.

