ముద్రగడ పై ఆ ఆరోపణలు… నిజమెంత?
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితమే. ఆయన తొలి నుంచి కాపుల సంక్షేమం కోసం పోరాడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ముద్రగడ [more]
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితమే. ఆయన తొలి నుంచి కాపుల సంక్షేమం కోసం పోరాడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ముద్రగడ [more]

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితమే. ఆయన తొలి నుంచి కాపుల సంక్షేమం కోసం పోరాడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ముద్రగడ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనం కల్గించేదే. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటన వెనక చాలా కధ ఉందని అంటున్నారు. అధికార పార్టీ డైరెక్షన్ లోనే అంతా జరిగిందన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది.
కాంగ్రెసేతర ప్రభుత్వాలున్నప్పుడే…
ముద్రగడ పద్మనాభంపై ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. ముద్రగడ పద్మనాభంకు కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్లు గుర్తుకు వస్తాయన్నది ప్రధాన విమర్శ. కాపు రిజర్వేషన్లను తొలగించింది కాంగ్రెస్ పార్టీ నేతలే. అయితే అప్పుడు ఎటువంటి ఉద్యమం చేయని ముద్రగడ పద్మనాభం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉద్యమ బాట పట్టారన్నది తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో ఆరోపిస్తున్నారు.
జగన్ మొండోడు కావడంతో….
అయితే జగన్ తన పాదయాత్రలోనే కాపు రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉంటాయని, తాను కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండటంతో మరో నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని నడపలేమని ముద్రగడ చేతులెత్తేసినట్లు కనపడుతుంది. జగన్ మొండోడు. పైగా కాపు రిజర్వేషన్లపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అందుకే ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారంటున్నారు.
సన్నిహితుల వ్యాఖ్యలు కూడా…..
మరోవైపు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం పేరిట విరాళాలు వసూలు చేసి దాచుకున్నారన్న ఆరోపణలు కూడా సొంత సామాజికవర్గం నుంచే రావడంతో ఆయన హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆర్థికంగా చితికిపోవడం, సన్నిహితుల వ్యాఖ్యలు మరింత బాధించడంతోనే ఆయన కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారన్నది కిర్లంపూడిలో విన్పిస్తున్న టాక్. ముద్రగడ తన లేఖలో ముఖ్యమంత్రి జగన్ కంటే చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.

