ఆ ఎమ్మెల్యే సైకిల్ దిగేస్తున్నాడు.. వైఎస్ జయంతికి ముందే?
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే టీడపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీని వీడేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. మంతెన రామరాజు వైసీపీలో చేరేందుకు ముహూర్తం [more]
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే టీడపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీని వీడేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. మంతెన రామరాజు వైసీపీలో చేరేందుకు ముహూర్తం [more]

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే టీడపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీని వీడేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. మంతెన రామరాజు వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారని చెబుతున్నారు. వైఎస్ జయంతికి ఒక్కరోజు ముందు ఆయన పార్టీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మంతెన రామరాజు గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
రెండు స్థానాలను గెలిచి….
2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ సాధించిన టీడీపీ 2019 ఎన్నికలకు వచ్చే సరికి రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజు గెలుపొందారు. అయితే మంతెన రామరాజు గెలిచినా ఆయన ఎమ్మెల్యేగా చూడటం లేదు. అధికారులు ఆయనను ప్రతిపక్ష నేతగానే చూస్తున్నారు. అనధికార ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీల్ నరసింహరాజు వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచినా……
ఏ కార్యక్రమమూ మంతెన రామరాజు చేతుల మీదుగా జరగడం లేదు. నియోజకవర్గంలో పనులన్నీ తనపై పోటీ చేసి ఓటమి పాలయిన నరసింహరాజు మాత్రమే చేస్తున్నారు. ఈయన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సన్నిహితుడు కావడతో ఉండి నియోజకవర్గంలో ఈయన హవా మాత్రమే నడుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజు మాత్రం ఏమీ చేయలేని నిన్సహాయ స్థితిలో ఉన్నారు. కనీసం తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
కొద్దిరోజుల్లో చేరికకు…..
దీంతో మంతెన రామరాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. సొంత పనులు చక్కబెట్టుకోలేకపోవడం ఒక ఎత్తైతే, వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయని మంతెన రామరాజు తెగ ఫీలయిపోతున్నారట. అందుకే అధికార వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. నిజానికి మహానాడుకు ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా జగన్ అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో ఆయన చేరిక వాయిదా పడింది. దీంతై వైఎస్సార్ జయంతికి ముందు మంతెన రామరాజు టీడీపీని వీడి వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

