నోరు తెరిస్తే డోరు మూసేయండి
భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువయింది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడేస్తున్నారు. నియంత్రించే వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్లనే [more]
భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువయింది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడేస్తున్నారు. నియంత్రించే వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్లనే [more]

భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువయింది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడేస్తున్నారు. నియంత్రించే వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్లనే అనేక సార్లు పార్టీలో ఇబ్బందులు పడుతోంది. ఇదీ బీజేపీ సీనియర్ నేతల నుంచి విన్పిస్తున్న మాటలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతోంది. మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్న హెచ్చరికలను కూడా సంఘ్ పంపినట్లు సమాచారం.
కంట్రోల్ దాటి…
భారతీయ జనతా పార్టీలో నేతలు తమ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలోనే ఇది చూశాం. మహాత్మాగాంధీ మొదలుకుని అంబేద్కర్ వరకూ ఎవరిని వదిలి పెట్టకుండా కామెంట్స్ చేయడం న్యూస్ లోకి ఎక్కడం బీజేపీ నేతలకు రివాజుగా మారి పోయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసింది. నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ నేతల వ్యాఖ్యలే కారణమని అమిత్ షా సయితం అంగీకరించడం విశేషం.
ఢిల్లీ ఎన్నికల్లో…..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని కామెంట్లు చేశారు. ఒకరు గోలీ మార్ అంటే మరొకరు పాక్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటూ స్వరం పెంచారు. ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా లెక్క చేయలేదు. విద్వేష పూరిత వ్యాఖ్యల వల్లనే ఢిల్లీలో పార్టీ ఓటమికి ఒక కారణంగా బీజేపీ పెద్దలు సయితం ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు హెచ్చరికలు ఇప్పటికే పంపారు. పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే స్పందించాల్సి ఉంటుందని, మంత్రులు సయితం ఆవేశపూరితంగా మాట్లాడి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పడేయవద్దని ఇప్పటికే పార్టీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి.
జికపై నోరు జారితే…..
నేతల నోళ్లను అదుపులో పెట్టే బాధ్యతను అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలే గాడి తప్పుతున్నట్లు గుర్తించిన అధినాయకత్వం వారిని అదుపులో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, ఎంపీలు పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా వంటి నేతల కారణంగానే ఢిల్లీ ఎన్నికల్లో ఇబ్బంది ఎదురయిందని నిర్ణయానికి వచ్చిన పార్టీ అధినాయకత్వం వారిని కంట్రోల్ చేయడానికి నిర్ణయించింది. ఇకపై ఎవరు మాట్లాడినా సంయమనంతో మాట్లాడాలని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని సీనియర్ నేతల నుంచి అందరికీ పార్టీ అధినాయకత్వం నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. మరి నేతలు కంట్రోల్ అవుతారో? లేదో? చూడాలి.

