బ్రదర్స్ ది బెస్ట్
ఉన్నోళ్లలో వీళ్లే బెస్ట్. ఎన్నికల సమయంలో తమ తడాఖా చూపుతారు. పార్టీ కోసం పనిచేస్తారు. క్యాడర్ కోసం దేనికైనా సిద్ధపడతారు. అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ పై కాంగ్రెస్ [more]
ఉన్నోళ్లలో వీళ్లే బెస్ట్. ఎన్నికల సమయంలో తమ తడాఖా చూపుతారు. పార్టీ కోసం పనిచేస్తారు. క్యాడర్ కోసం దేనికైనా సిద్ధపడతారు. అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ పై కాంగ్రెస్ [more]

ఉన్నోళ్లలో వీళ్లే బెస్ట్. ఎన్నికల సమయంలో తమ తడాఖా చూపుతారు. పార్టీ కోసం పనిచేస్తారు. క్యాడర్ కోసం దేనికైనా సిద్ధపడతారు. అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ పై కాంగ్రెస్ పార్టీలోనే విన్పిస్తున్న కామెంట్స్ ఇవి. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కాంగ్రెస్ లోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వారి దూకుడు వల్ల ఎలాంటి పెద్ద పదవులు లభించలేదు. పీసీసీ పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ గతకొంతకాలంగా కోరుతున్నా అధిష్టానం కూడా వారి వైపు చూడటం లేదు.
పార్టీ పరువును…..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ పరువును కొద్దోగొప్పో నిలబెడుతున్నారన్నది వాస్తవం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం మరోసారి రుజువైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయినా తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ మారతారని నిన్న మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. అయితే వారు పార్టీ కోసం, క్యాడర్ ను కాపాడుకోవడం కోసం కష్టపడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఏ నేత ప్రాంతంలోనైనా….
తెలంగాణాలో కాంగ్రెస్ కు ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ఆరుగురు శాసనసభ్యులున్నారు. వీరిలో సీతక్క, పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. మిగిలిన నలుగురు పెద్ద నేతలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపాలిటీలో ఉన్న 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. మల్కాజ్ గిరి పరిధిలోని బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లలో ఏ ఒక్కంటిలో విజయం సాధించలేకపోయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం లో మున్సిపాలిటీనీ టీఆర్ఎస్ దక్కించుకుంది. శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధనిలోనూ అంతే. ఇక జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, సదాశివపేటలోనూ టీఆర్ఎస్ జెండా ఎగిరింది.
ఇద్దరి ఇలాకాలో…..
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్, చుండూరు, తుర్కయాంజల్ మున్సిపాలిటీలు నాలుగింటిలోనూ హస్తం పార్టీ విజయం సాధించింది. గతంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ తమ తడాఖా చూపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని చుండూరును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ మిగిలిన నేతలకంటే బెస్ట్ అని చెప్పకనే చెబుతున్నారు.

