ఆయన చేరినా ఈయనకు వచ్చే నష్టమేదీ లేదట
కేకే రాజు. ఈ పేరు విశాఖలో అందరికీ తెలుసు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తుండటంతో మరోసారి కేకే రాజు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కేకే [more]
కేకే రాజు. ఈ పేరు విశాఖలో అందరికీ తెలుసు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తుండటంతో మరోసారి కేకే రాజు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కేకే [more]
కేకే రాజు. ఈ పేరు విశాఖలో అందరికీ తెలుసు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తుండటంతో మరోసారి కేకే రాజు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కేకే రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ వ్యాపారం నుంచి కేకేరాజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వైసీపీ పటిష్టతకు తోడ్పడ్డారు. జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాకు ఎంటర్ అయన దగ్గర నుంచి ముగిసే వరకూ కేకేరాజుదే హడావిడి అంతా. అనుకున్నట్లుగానే కేకే రాజుకు జగన్ విశాఖ ఉత్తర నియోజకవర్గం టిక్కెట్ ను కేటాయించారు.
స్వల్ప ఓట్ల తేడాతో….
గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావును ఓడించనంత పని చేశారు. కేకేరాజు గంటా శ్రీనివాసరావు చేతిలో కేవలం 1,944 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తూర్పు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో గ్రౌండ్ చేస్తున్నారు. కేకే రాజు తనకంటూ నియోజకవర్గంలో ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందచేస్తున్నారు.
హైకమాండ్ హామీ ఇవ్వడంతో….
అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరితే కేకేరాజు భవితవ్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి గట్టి హామీ వచ్చిందంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే తిరిగి టిక్కెట్ కేకే రాజుకు ఇస్తారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయకపోతే నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని చెబుతున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరినా కేకే రాజుకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు.
టిక్కెట్ ఎప్పుడైనా ఆయనకే….
అధిష్టానం నుంచి కేకే రాజుకు మరో భరోసా కూడా లభించిదంటున్నారు. గంటా శ్రీనివాసరావు చేరినా వచ్చే ఎన్నికల్లోనూ కేకే రాజుకే టిక్కెట్ ఇస్తామని, ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జిగా కూడా కేకే రాజు ఉంటారని హామీ ఇచ్చారట. దీంతో కేకే రాజు గంటా చేరికపై పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఉత్తర నియోజకవర్గంలో ఎప్పుడైనా తాను గెలిచి తీరతానని కేకే రాజు గట్టిగా చెబుతున్నారట. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు చేరినా కేకే రాజుకు వచ్చిన నష్టమేమే లేదని పార్టీ నుంచి గట్టి భరోసా వచ్చినట్లు తెలుస్తోంది.