కిషన్ రెడ్డి కష్టం ఎవరికీ వద్దబ్బా
కిషన్ రెడ్డికి ఏం కష్టం వచ్చిందనుకుంటున్నారు. ఆయన కేంద్రమంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు , హోంమంత్రి అమిత్ షాకు సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. [more]
కిషన్ రెడ్డికి ఏం కష్టం వచ్చిందనుకుంటున్నారు. ఆయన కేంద్రమంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు , హోంమంత్రి అమిత్ షాకు సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. [more]

కిషన్ రెడ్డికి ఏం కష్టం వచ్చిందనుకుంటున్నారు. ఆయన కేంద్రమంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు , హోంమంత్రి అమిత్ షాకు సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది భాష మాత్రమేనట. పార్లమెంటు, రాజ్యసభల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు గాని, ప్రభుత్వం తరుపున సమాధానం ఇవ్వడంలో కానీ కిషన్ రెడ్డి తడబడతున్నారట. అందుకు కారణం కిషన్ రెడ్డికి హిందీ భాషలో పూర్తిగా పట్టు ఉండకపోవడమే.
ఓడి ..గెలిచి..మంత్రి అయి….
కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా సీనియర్ నేత, పార్టీలో తొలి నుంచి ఉండటంతో కిషన్ రెడ్డికే ప్రాధాన్యత దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి సేవలను కేంద్రంలో వినియోగించుకోవాలని భావించి ఆయనను మోదీ మంత్రవర్గంలోకి తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించారు.
భాషపై పట్టులేక….
కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో కూర్చున్నాక కాని అసలు విషయం అర్థం కాలేదు. తనకు హిందీ భాషపై పట్టులేనట్లు ఆయనే గుర్తించారు. కిషన్ రెడ్డి పెరిగింది హైదరాబాద్ లోనైనా హిందీ భాషపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మూడు ధఫాలు అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడేవారు. దీంతో హిందీభాషపై కిషన్ రెడ్డికి పట్టుదొరకలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాక హిందీ భాష అవసరం కిషన్ రెడ్డికి గుర్తొచ్చింది.
శిక్షణ తీసుకుంటూ….
కేంద్ర ప్రభుత్వం అనేక కీలక బిల్లులు తీసుకొచ్చిన సందర్భంలో, అమిత్ షా సభలో లేని సమయంలో కిషన్ రెడ్డి సమాధానమివ్వాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి మాట్లాడే హిందీ ఉత్తరాది వారికి అర్థం కావడం లేదట. సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానమివ్వాలన్నా అది అర్థం కావాలి కదా? అందుకే కిషన్ రెడ్డి ఇప్పుడు హిందీ భాషను నేర్చుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఆయన హిందీపై ప్రత్యేక శిక్షణను తీసుకుంటారని తెలిసింది. ఢిల్లీలోనే ట్యూటర్ ను పెట్టుకుని కిషన్ రెడ్డి హిందీపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారట. మరి కిషన్ రెడ్డి బాధ ఎవరికీ రాకూడదు కదా?

