పొగ పెడుతున్నారా?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన చంద్రబాబు జరిపే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. తెలుగుదేశం పార్టీలో [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన చంద్రబాబు జరిపే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. తెలుగుదేశం పార్టీలో [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన చంద్రబాబు జరిపే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. తెలుగుదేశం పార్టీలో తనను ఒంటరిని చేస్తున్నారని కేశినేని నాని ఫీలవుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి తనకు చెక్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కేశినేని నాని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత నుంచి….
ఎప్పటి నుంచో కేశినేని నాని పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఓటమి తర్వాత తన సొంత భవనం నుంచి పార్టీ కార్యాలయాన్ని తీసివేయం దగ్గర నుంచి కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. దీని వెనక దేవినేని ఉమ ఉన్నాడని తెలిసినా ఆయనపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని భావించి మౌనంగా ఉన్నారు. ఇక పార్టీలోనూ తనకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంపై కూడా కేశినేని నాని ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.
ఎలాంటి చర్యలు…?
దీనికి తోడు ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు అధినాయకత్వానికి, కేశినేని నానికి మధ్య మరింత దూరం పెంచాయంటున్నారు. ఎన్నికల సందర్బంగా టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలు తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా కనీసం వారిని పిలిచి మందలించనూ లేదు. తనపై నగర నాయకులు తిరగబడినా పట్టించుకోని అధిష్టానాన్ని సమయం వచ్చినప్పుడు కడిగేయాలని కేశినేని నాని భావిస్తున్నారు.
బీజేపీలోకి వెళ్లాలనుకున్నా….
అయితే తనకు పొగపెడుతున్నారని కేశినేని నాని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే తాను సర్దుకుంటే మంచిదన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఒకదశలో బీజేపీలోకి వెళ్లాలనుకున్నారు. బీజేపీలోకి వెళ్లి పోటీ చేద్దామనుకున్నా ఆ పార్టీకి సరైన ఓటుబ్యాంకు లేదు. దీంతో ఆయన ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉండి పోరాటం చేయాలని కేశినేని నాని భావిస్తున్నారు. చంద్రబాబును త్వరలో కలసి తన భవిష్యత్ రాజకీయంపై ఆయన చర్చిస్తారని చెబుతున్నారు.