పాపం కన్నా… ఇక్కడా మొండి చేయేనా?
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఎన్నో సార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన వైసీపీలో చేరాలనుకుని చివరి నిమిషంలో [more]
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఎన్నో సార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన వైసీపీలో చేరాలనుకుని చివరి నిమిషంలో [more]

కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఎన్నో సార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన వైసీపీలో చేరాలనుకుని చివరి నిమిషంలో బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఆయన ఆ పదవికి తన పరిధిలో న్యాయం చేశారనే చెప్పాలి. సామాజిక వర్గం కూర్పులో ఆయనకు బీజేపీ అధ్యక్ష్య పదవి లభించినా పార్టీని ఎన్నికల్లో సక్రమంగా నడిపించలేకపోయారన్న విమర్శలున్నాయి.
కన్నాను తప్పించడంపై….
అందువల్లనే ఆయన టర్మ్ పూర్తయిన వెంటనే మరోసారి కేంద్ర నాయకత్వం రెన్యువల్ చేయలేదు. ఆయన స్థానంలో సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. సోము వీర్రాజు అధ్యక్ష్య బాధ్యతలను స్వీకరించే సందర్బంలో పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్ పార్టీ కన్నాను పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. దీంతో ఆయనకు జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి వస్తుందని అందరూ ఆశించారు.
జాతీయ కమిటీలోనూ….
కానీ తాజాగా ప్రకటించిన జాతీయ కమిటీలో ఆయనకు చోటు లభించలేదు. పురంద్రీశ్వరికి జాతీయ కార్యదర్శిగా నియమించారు. కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారు. ఇది కన్నా లక్ష్మీనారాయణ సయితం ఊహించలేదు. తన స్థానంలో వేరొకరిని రాష్ట్రంలో నియమిస్తే తనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటారని కన్నా లక్ష్మీనారాయణ ఊహించారు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. జాతీయ కమిటీలో స్థానం దక్కలేదు.
కరివేపాకుగానేనా?
ఆంధ్రప్రదేశ్ లో కమ్మ + కాపు కాంబినేషన్ లో పురంద్రీశ్వరికి చోటు లభించింది. కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు పురంద్రీశ్వరికి స్థానం కల్పించి కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారంటున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర నిరాశకు గురయినట్లు తెలిసింది. పార్టీలో చేరే ముందు ఇచ్చిన హామీలను కేంద్ర నాయకత్వం గుర్తుపెట్టుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ వర్గం గుర్రుగా ఉందంటున్నారు. మొత్తం మీద బీజేపీ అధినాయకత్వం కన్నా లక్ష్మీనారాయణను కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది ఆయన వర్గం ఆరోపణగా విన్పిస్తుంది.

