బ్రేకింగ్ : ఆర్టీసీ ఇక లేనట్లే… కేసీఆర్ సంచలన కామెంట్స్
‘‘ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. అనవసరమైన, అర్థం పర్థంలేని డిమాండ్ లను ఆర్టీసీ కార్మికులు తెస్తున్నారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకు బడ్జెట్ కు [more]
‘‘ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. అనవసరమైన, అర్థం పర్థంలేని డిమాండ్ లను ఆర్టీసీ కార్మికులు తెస్తున్నారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకు బడ్జెట్ కు [more]

‘‘ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. అనవసరమైన, అర్థం పర్థంలేని డిమాండ్ లను ఆర్టీసీ కార్మికులు తెస్తున్నారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకు బడ్జెట్ కు కుదించుకున్నాం. ఆర్భాటాలకు మేం పోలేదు. అంత కఠినంగా ఉన్నాం. ఆర్థిక మాంద్యం దెబ్బకు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీ కుప్పకూలిపోయింది. ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీపై నాకన్నా ఎక్కువ అవగాహన ఎవరికీ ఉండదు. గతంలో నేను మూడు సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా పనిచేశా. 1997లో నష్టాల్లో ఉన్నదానిని లాభాల్లోకి తెచ్చి ఆర్టీసీని కాపాడా. 44 శాతం ఆర్టీసీ కార్మికుల జీతాలను పెంచాను. ఐఆర్ కూడా పెంచాను. దేశ చరిత్రలో నాలుగేళ్లలో ఎక్కడైనా 67శాతం ఆర్టీసీ కార్మకుల జీతాలను ఎవరైనా పెంచారా? ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎట్లా? ఎవరిని మోసం చేస్తున్నారు? రోడ్డు మీద పడి ఎవరు పడితే వారు మాట్లాడితే సరిపోతుందా? ప్రభుత్వంలో విలీనం చేయడమంటే మాటలా? మిగిలిన యాభై కార్పొరేషన్లను ఏం చేయాలి? రాజకీయ పార్టీలు, తలకాయ, నెత్తి మాసిపోయినోళ్లతో తిరిగి అర్థం పర్థం లేని డిమాండ్లు తెస్తున్నారు. సమ్మెను రాజకీయం చేయడం సబబేనా? ఏం తమాషానా?’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
దిక్కుమాలిన యూనియన్లతోనే….
‘‘పది కోట్ల జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ లో 200 బస్సులే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఆర్టీసీని మూసేసింది కాంగ్రెస్ కాదా? ఆలోచన, బుద్ధి ఉండి చేసే సమ్మేనా? ఇది. యూనియన్లు చేసే సమ్మె ఇది. చిల్లర, మల్లర యూనియన్ ఎన్నిలకు ముందు జరిగే పనికిమాలిన సమ్మె ఇది. ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఆర్టీసీ ఉంది. సమ్మె కారణంగా మరింత దిగజారింది. ప్రయివేటు ట్రావెల్స్ లాభాల్లో ఉంటే ఆర్టీసీకి ఎందుకు నష్టం వస్తుంది? ఆర్టీసీలో 2100 అద్దె బస్సులున్నాయి. అద్దె బస్సులపై ఆర్టీసీకి లాభం వస్తుంది. ఆర్టీసీ బస్సు నడిస్తే ప్రతి కిలోమీటరుకు 13 రూపాయల నష్టం వస్తుంది. దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతామంటే ఎలా? ఇక సమ్మె కాదు ఆర్టీసీనే ముగుస్తుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 4550 కోట్లు విడుదల చేశాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సమ్మె చేస్తాం అంటే ఎలా? లక్షలాది రూపాయలు ఆర్జించాల్సిన సమయంలోదసరా పండగకు సమ్మె చేస్తారా? అద్భుతమైన సమయంలో సమ్మెకు పోతారా? కమిటీ ఎంత నచ్చ చెప్పినా వినకుండా సమ్మెకు పోయారు.
సమ్మె చట్టవిరుద్ధం….
పనిచేసిన కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బుల్లేవు. ఆర్టీసీని వారే స్వయంగా ముంచేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. యూనియన్ నేతలే ఆర్టీసీ కార్మికుల గొంతు కోశారు. సమ్మె చేయడం చట్ట విరుద్ధం. ఎస్మా అమల్లో ఉంది. కార్మిక శాఖ ఇప్పటికే సమ్మె చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది.సమ్మె ఫలితం ఏందంటే వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే అవకాశం లేదు. ఇందుకు కారణం యూనియన్లు, వారికి మద్దతిస్తున్న రాజకీకీయ పార్టీలు. యూనియన్లు ఉంటే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు’’ అని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ తేల్చి చెప్పారు. యూనియన్లు లేకుండా పనిచేస్తే రెండేళ్లలో ఆర్టీసీ కార్మికులకు కూడా లక్ష రూపాయల బోనస్ ఇవ్వవచ్చన్నారు.

