జేసీ చెక్ పెట్టేశారటగా
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ రాజకీయాలు సరికొత్తదిశగా మారుతున్నాయా? నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పిన తల్లికూతుళ్లకు చెక్ పెట్టేదిశగా జేసీ రాజకీయాలు ఊపందుకున్నాయా? అంటే.. తాజా [more]
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ రాజకీయాలు సరికొత్తదిశగా మారుతున్నాయా? నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పిన తల్లికూతుళ్లకు చెక్ పెట్టేదిశగా జేసీ రాజకీయాలు ఊపందుకున్నాయా? అంటే.. తాజా [more]

అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ రాజకీయాలు సరికొత్తదిశగా మారుతున్నాయా? నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పిన తల్లికూతుళ్లకు చెక్ పెట్టేదిశగా జేసీ రాజకీయాలు ఊపందుకున్నాయా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కొన్ని గత కొన్నేళ్లుగా శమంతకమణి రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ కాకముందు ఇక్కడ జేసీ దివాకర రెడ్డి చక్రం తిప్పేవారు. ఆయన సొంత నియోజకవర్గం కూడా.. ఆయన గతంలో ఇక్కడ నుంచి పంచాయతీ సమితీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.
శమంతకమణి పాతుకుపోవడంతో….
అయితే, ఇది రిజర్వ్ అయిన తర్వాత శమంతకమణి ఇక్కడ పాగావేశారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఇక్కడ వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గంపై ఆయన పట్టు కోల్పోయారు. ఇక శమంతకమణి చంద్రబాబు కోటరీలో గుర్తింపు కూడా సాధించారు. ఈ క్రమంలోనే 2014లో శమంతకమణి తన కుమార్తె యామినీ బాలకు టికెట్ ఇప్పించుకున్నారు.
కుటుంబంలో విభేదాలు….
అప్పటి వరకు టీచర్‌గా ఉన్న యామినీ బాల ఒక్క సారిగా తల్లి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి రావడం, గెలవడం కూడా జరిగింది. అదే సమయంలో చంద్రబాబు కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, కేబినెట్లో చోటు ఇవ్వక పోయినా.. విప్‌గా చంద్రబాబు గౌరవించారు. శమంతకమణికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక, తాజా ఎన్నికల విషయానికి వచ్చే సరికి కుమార్తెకు తల్లికి మధ్య అగాధం ఏర్పడింది. కొన్ని విషయాల్లో తనను విభేదిస్తున్న కుమార్తెకు చెక్ పెట్టాలని భావించిన శమంతకమణి.. ఏకంగా ఈదఫా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ నియోజకవర్గం ఎన్నికలకు ముందు హాట్‌గా మారింది.
జేసీ సిఫార్సుతోనే….
ఈ క్రమంలోనే తన పాత నియోజకవర్గంపై జేసీ దృష్టి పెట్టారు. ఎలాగూ శమంతకమణి కుటుంబంలో ఏర్పడిన విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని తనకు అనుకూలంగా వారికి టికెట్ ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు కూడా శమంతకమణిని పక్కన పెట్టి జేసీ వర్గం చెప్పినట్టే శ్రీదేవి అనే యువతికి సీటు ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసిన పద్మావతి చేతిలో ఓడిపోయారు.
ఆహ్వానించకుండా….
తాజాగా మూడు రోజుల క్రితం ఇక్కడ టీడీపీ నాయకులు పెద్ద సభ ఏర్పాటు చేశారు. దీనికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ జేసీ వంటి వారు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై చర్చించారు. అయితే, తన నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి శమంతకమణి కానీ, తాజాగా మాజీ అయిన యామినీ బాల కానీ రాకపోవడంతో ఇక, వీరికి పార్టీలో చెక్ పడినట్టే భావిస్తున్నారు. పార్టీ కేడర్ కూడా ఈ తల్లికూతుళ్లను పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.