పవన్ ను అలా వాడుకోవాలని డిసైడ్ అయ్యారా?
జనసేన, బీజేపీలు కలసి నేడు మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక [more]
జనసేన, బీజేపీలు కలసి నేడు మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక [more]

జనసేన, బీజేపీలు కలసి నేడు మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. కేంద్రం నుంచి నిధులను తెప్పించి గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ మ్యానిఫేస్టో ఉండబోతోంది. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మ్యానిఫేస్టోను రూపొందించింది.
కేంద్ర ప్రభుత్వ నిధులను…..
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం తాము ప్రకటించిన పథకాలకు ఎలా వాడుకుంటుందో ఈ మ్యానిఫేస్టోలో తెలియజేయబోతున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా మ్యానిఫేస్టోతో పని ఉండదు. గ్రామాలు, మండలాల్లో నెలకొన్న సమస్యలను లోకల్ గా అక్కడి అభ్యర్థులే తమ ప్రచారంలో ప్రజలకు చెప్పుకుంటారు. కానీ బీజేపీ, జనసేన విజన్ డాక్యుమెంట్ పేరుతో మ్యానిఫేస్టోను విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
నెట్ వర్క్ లేకున్నా…..
బీజేపీ, జనసేన పొత్తుతో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. రెండు పార్టీలకు గ్రామస్థాయిలో పటిష్టమైన నెట్ వర్క్ లేదు. క్యాడర్ కూడా లేదు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలన్నది రెండు పార్టీల లక్ష్యంగా కన్పిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించుకోబోతున్నారు.
పవన్ సభలపై….
ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ స్టిక్కర్లు అంటించి గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఎలా వినియోగించుకున్నదీ పవన్ నోటి చేత చెప్పించనున్నారు. అయితే ఇది ఎన్నికల్లో బీజేపీ, జనసేనలకు ఎంతవరకూ లాభిస్తుందీ అన్నది చూడాల్సి ఉంది. ఇక పవన్ పర్యటనపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. రోడ్ షోలు, సభల్లో ఎక్కడెక్కడ పవన్ కల్యాణ్ పాల్గొనేది నేడు ప్రకటించనున్నారు.

