మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా?
రాజకీయాల్లో సెంటిమెంట్ కు మించింది లేదు. సెంటిమెంట్ పండితే సీట్లు పంట పండినట్లే. అందుకే రాజకీయ పార్టీలు తమ పనితీరు కన్నా సెంటిమెంట్ ను ప్రజల్లోకి జొప్పించేందుకే [more]
రాజకీయాల్లో సెంటిమెంట్ కు మించింది లేదు. సెంటిమెంట్ పండితే సీట్లు పంట పండినట్లే. అందుకే రాజకీయ పార్టీలు తమ పనితీరు కన్నా సెంటిమెంట్ ను ప్రజల్లోకి జొప్పించేందుకే [more]

రాజకీయాల్లో సెంటిమెంట్ కు మించింది లేదు. సెంటిమెంట్ పండితే సీట్లు పంట పండినట్లే. అందుకే రాజకీయ పార్టీలు తమ పనితీరు కన్నా సెంటిమెంట్ ను ప్రజల్లోకి జొప్పించేందుకే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెంటిమెంట్ రాజకీయం ఊపందుకుంది. ఉప ఎన్నికలు కావచ్చు. రానున్న సాధారణ ఎన్నికలు కావచ్చు. జల వివాదాన్ని అధికార పార్టీలు రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ వివాదాలు ఇప్పటివా?
నీటి వివాదాలు ఇప్పటివి కావు. అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ వాటి పరిష్కారానికి నీటి బోర్డులు ఉన్నాయి. ప్రతి నదికి కేంద్ర ప్రభుత్వం బోర్డును నియమించి దాని పర్యవేక్షణలోనే నీటి కేటాయింపులు జరుపుతుంది. అయితే అక్రమ ప్రాజెక్టులంటూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, మాటల యుద్ధం కొనాగుతుండటం సెంటిమెంట్ హీట్ ను కొంతకాలం కొనసాగించడానికేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ప్రాజెక్టుల నిర్మాణంతో….
నిజానికి తెలంగాణలోనూ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా దాదాపు ఏడాది నుంచి నడుస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు విమర్శలకు దిగింది. మరోవైపు ఏపీ సయితం తెలంగాణ జల విద్యుత్తు ఉత్పత్తిపై అభ్యంతరం తెలుపుతోంది.
అందుకోసమేనా?
అయితే ఇవన్నీ ఎప్పుడూ ఉండేవనని, హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామా అని టి.కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ ప్రాంతాలను ఏడేళ్లుగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపిందంటున్నారు. ఏపీలోనూ అధికార పార్టీ ప్రజల్లో తమ పట్ల సానుకూలతను మరింత పెంచుకునేందుకే జలవివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుందన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తం మీద రెండు అధికార పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నది విపక్షాల ఆరోపణ.

