జగన్ చెప్పిందే.. కమిటీ కూడా?
జీఎన్ రావు కమిటీ దాదాపు 200 పేజీల నివేదికను రూపొందించింది. జగన్ తో భేటీ ముగిసిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. ప్రజల అభిప్రాయాలను [more]
జీఎన్ రావు కమిటీ దాదాపు 200 పేజీల నివేదికను రూపొందించింది. జగన్ తో భేటీ ముగిసిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. ప్రజల అభిప్రాయాలను [more]

జీఎన్ రావు కమిటీ దాదాపు 200 పేజీల నివేదికను రూపొందించింది. జగన్ తో భేటీ ముగిసిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. ప్రజల అభిప్రాయాలను అన్ని ప్రాంతాలను తిరిగి సేకరించామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా సిఫార్సులు చేశామన్నారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయన్నారు. ప్రధానంగా రాయలసీమ బాగా వెనకబడి పోయిందన్నారు. అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రాంతాల మధ్య సమతూకం సాధంచాలన్నారు. దీనికోసం తమ కమిటీ రెండంచెల వ్యూహాన్నిి రూపొందించిందన్నారు. ఒకటి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రెండు ప్రాంతీయ అసమానతలను తొలగించడం తమ సూచనల్లో ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిని నివేదికలో పొందుపర్చామన్నారు. ఒకే చోట అభివృద్ధి జరగడం మంచిదికాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగానే నివేదికను రూపొందించామని చెప్పారు. కోస్తా, రాయలసీమల మధ్య వనరుల వినియోగం సమర్థవంతంగా జరగాలని కమిటీ అభిప్రాయపడిందన్నారు. పదమూడు జిల్లాల అభివృద్ధికి సిఫార్సులు చేశామన్నారు. రాయలసీమలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.
విశాఖలోనే సెక్రటేరియట్….
పరిపాలన సౌలభ్యం కోసం ఉత్తర, దక్షిణ, మద్య, రాయలసీమరీజియన్ లుగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక రీజియన్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి ,కృష్ణా జిల్లాలు ఒక రీజియన్ గా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక రీజియన్ గా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను ఒక రీజియన్ గా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వరద ముంపు లేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించామన్నారు. తుళ్లూరులో కొన్ని జోన్లు వరద తాకిడికి గురవుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, దానిని వాడుకోవాలని సూచించామన్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ కార్యాలయాల ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. లెజిస్లేచర్ అసెంబ్లీ అమరావతిలోనే శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని సూచించాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక వనరులను దృష్టిలోపెట్టుకునే ఈ సిఫార్సులు చేశామన్నారు. ఈ సిఫార్సులు అమలయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందన్నారు.

