తూ..నాబొడ్డు అంటున్న టీడీపీ లీడర్…ఆందోళనలో క్యాడర్
రాజకీయాల్లో ఒక ఛాన్స్ రావడమే గొప్ప విషయంగా నాయకులు భావిస్తారు. అలాంటిది.. అధిష్టానం అనేక సార్లు అవకాశం ఇస్తే.. అధిష్టానం ఎప్పటికప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. సదరు [more]
రాజకీయాల్లో ఒక ఛాన్స్ రావడమే గొప్ప విషయంగా నాయకులు భావిస్తారు. అలాంటిది.. అధిష్టానం అనేక సార్లు అవకాశం ఇస్తే.. అధిష్టానం ఎప్పటికప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. సదరు [more]

రాజకీయాల్లో ఒక ఛాన్స్ రావడమే గొప్ప విషయంగా నాయకులు భావిస్తారు. అలాంటిది.. అధిష్టానం అనేక సార్లు అవకాశం ఇస్తే.. అధిష్టానం ఎప్పటికప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. సదరు నాయకులు ఎంత అంకిత భావంతో పనిచేయాలి ? ఎంతగా పార్టీ కోసం రుణం తీర్చుకోవాలి? సాధారణంగా ఈ ప్రశ్నలకు సమాధానం.. పార్టీని అంటిపెట్టుకుని ఉండాలని, పార్టీ కోసం జీవించినంత కాలం పనిచేయాలనే సమాధానం వస్తుంది. కానీ ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఈలి నానిని అడిగితే.. మాత్రం 'తూ.. నాబొడ్డు!' అనే అంటారు! ఎందుకంటే.. ఆయన అలా లేరు. తనకు నచ్చినట్టుగా.. తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నందునే.
నాడు జంప్ చేసి…..
విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన కుటుంబం ఈలి ఫ్యామిలీ. ఈలి ఆంజనేయులు, వరలక్ష్మిలు టీడీపీలో చాన్నాళ్లు పనిచేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడేపల్లిగూడెం నుంచి వారు విజయం సాధించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఫ్యామిలీకి చంద్రబాబుసైతం మంచి ప్రయార్టీ ఇచ్చారు. ఈలి ఆంజనేయులు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, వీరి కుమారుడు ఈలి నాని మాత్రం 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకుని జంప్ చేసి.. టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరఫున 2009లో తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నాడు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో పోటీ చేసిన చిరంజీవి సైతం పాలకొల్లులో ఓడిపోతే గూడెంలో మాత్రం ఈలి నాని గెలిచారు.
కాంగ్రెస్ లోకి వెళ్లి…టీడీపీలో చేరి…..
ఇక, ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు ఈలి నాని కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మళ్లీ రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో టీడీపీ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో టీడీపీ తరఫున తాడేపల్లిగూడెం టికెట్‌ను ఈలి నాని ఆశించారు. అయితే, అప్పటి బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే, గత ఏడాది మాత్రం చంద్రబాబు ఈలి నానికి తాడేపల్లి గూడెం టికెట్‌ను ఇచ్చి ప్రోత్సహించారు. అయితే, ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. ఇక, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు వైసీపీ నాయకుడు, జిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగనాథరాజుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మంత్రితో చెట్టపెట్టాలేసుకుని…..
వాస్తవానికి ఈలి నానిని చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే..గత ఏడాది ఈ టికెట్ కోసం మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పట్టుబట్టారు. అయినా కూడా బాబు ఆయనను కాదని.. ఈలి నానికే ఇచ్చారు. అయితే, ఈ విషయాన్ని మరిచిపోయిన ఈలి నాని ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం మానేశారు. పైగా బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలతో తిరుగుతున్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం ఇలా ఉంటే.. తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండా పట్టుకునే నాథుడు కనిపించకపోవడం మరింత దారుణంగా మారింది. మరి ఈ పరిణామాలను బాబు ఎలా చక్కదిద్దుతారో ? చూడాలి.
