Fri Dec 05 2025 07:16:42 GMT+0000 (Coordinated Universal Time)
Earth Day - పునరుత్పాదక శక్తి తో భద్రంగా ధరిత్రి
ఏప్రిల్ 22, 2025న 55వ ఎర్త్ డే ను జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు, ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు

ఏప్రిల్ 22, 2025న 55వ ఎర్త్ డే ను జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు, ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. అన్ని వర్గాల ప్రజలు మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడానికి ఈ రోజు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ఒక నాంది మాత్రమే. 2025 ఎర్త్ డే థీమ్ 'అవర్ పవర్, అవర్ ప్లానెట్' . క్లీన్ ఎనర్జీ ద్వారా 2030 నాటికి మూడు రెట్లు పునరుత్పాదక శక్తి పెంచడం కోసం అందరూ పాటు పడాలి. పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేసి, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల సమిష్టి బాధ్యత గురించి తెలియజేస్తుంది.
ఈ సంవత్సరం ఎర్త్ డే థీమ్ లో భాగంగా ప్రధాన దృష్టి పునరుత్పాదక శక్తి గురించే. శిలాజ ఇంధనాల ఉపయోగాన్ని ఆపేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సౌర, పవన, జల, భూఉష్ణ, టైడల్ విద్యుత్ వంటి క్లీన్, స్థిరమైన ఇంధన వనరుల వైపు మారవలసిన తక్షణ అవసరాన్ని ఈ థీమ్ నొక్కి చెబుతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడం ప్రాథమిక లక్ష్యం. పునరుత్పాదక శక్తికి మారడం చాలా అవసరం.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడం: శిలాజ ఇంధనాలు గ్రీన్హౌస్ వాయు రెసిడ్యూ లకు ప్రధాన కారణం, ఇది గ్లోబల్ వార్మింగ్, దాని పరిణామాలకు కారణమవుతుంది. పునరుత్పాదక శక్తి హానికరమైన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది, ఇది వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడం: శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిగించే హానికరమైన కాలుష్య కారకాలు విడుదలవుతాయి, స్వచ్ఛమైన శక్తిని వినియోగించడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు.
ఇంధన భద్రతను పెంచడం: శిలాజ ఇంధన వనరులపై ఆధారపడటం పలు విషయాలకు సంబంధించి అస్థిరతకు దారితీస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరులు తరచుగా మరింత వికేంద్రీకృతమై స్థానికంగా అందుబాటులో ఉంటాయి.
ఆర్థిక వృద్ధిని పెంచడం: పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, ఎన్నో ఉద్యోగాలను సృష్టించగలదు. ఆవిష్కరణ, ఆర్థిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం: కాలుష్య సంబంధిత వ్యాధులను తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది
పునరుత్పాదక ఇంధన వనరులు: మన చుట్టూ సమృద్ధిగా లభించే ఎండ, గాలి, నీరు సరిగా ఉపయోగించుకోవాలి
పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం గ్రీన్హౌస్ వాయు రెసిడ్యూ లను తగ్గించడానికి చాలా కీలకమైనవి. ఎందుకంటే పునరుత్పాదక ఇంధనాలు ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువు అయిన కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేయకుండా కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. శిలాజ ఇంధనాలు గ్రీన్హౌస్ వాయువుల ప్రధాన ఉద్గారాలకు కారణమవుతాయి. అందువల్ల గ్లోబల్ వార్మింగ్కు దోహదపడతాయి.
ఈ ఉద్యమాలు, కార్యక్రమాలలో భాగమవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు, కార్పొరేషన్లు నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. పునరుత్పాదక శక్తిని దృష్టిలో ఉంచుకుని ముందుకు కదలాలి, రోజువారీ జీవితంలో స్థిరమైన ఎంపికలు ప్రతి ఒక్కరికీ ఉండాలి. మనం మన స్వరాన్ని సగర్వంగా వినిపించాలి, గొప్ప కార్యాచరణ కోసం ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలి. భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని ఈ విప్లవం నిరూపిస్తుంది.
ఈ 2025 ఎర్త్ డే సందర్భంగా, మనందరికీ ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉందామని నిర్ణయం తీసుకుందాం. సౌర, పవన, జల విద్యుత్, టైడల్ లేదా జియోథర్మల్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరులకు మద్దతు ఇవ్వండి, మార్పును స్వీకరించండి.
ప్రభుత్వాల నుండి, ప్రపంచ పరిశ్రమ, స్థానిక వ్యాపారాల వరకు, యూనియన్ల నుండి, పాఠశాలల నుండి, మత నాయకుల నుండి, పౌర సమాజం, కుటుంబాలు, వ్యక్తుల వరకూ.. మీరు పట్టణ మేయర్ అయినా, ట్రేడ్ యూనియన్ అధినేత అయినా, CEO అయినా, బ్యాంకర్ అయినా, కళాకారుడైనా, రైతు అయినా, మత్స్యకారుడైనా, ఉపాధ్యాయుడైనా లేదా అగ్నిమాపక సిబ్బంది అయినా.. ఈ విప్లవం నిజమైన శక్తి మీలాంటి వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ఈ పరివర్తన వెనుక ఉన్న అసలు సిసలైన శక్తి ప్రజాశక్తి. భవిష్యత్తును మారుద్దాం.. ఈ భూమిని బతికించుకుందాం!!

Next Story