ద్రోణంరాజు వారసుడిని పట్టించుకుంటారా.. తొక్కేస్తారా ?
విశాఖ జిల్లా రాజకీయాల్లో దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణది ప్రముఖ స్థానం ఆయన మూడు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ చక్రం తిప్పారు. ఆయన పార్లమెంట్ [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణది ప్రముఖ స్థానం ఆయన మూడు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ చక్రం తిప్పారు. ఆయన పార్లమెంట్ [more]

విశాఖ జిల్లా రాజకీయాల్లో దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణది ప్రముఖ స్థానం ఆయన మూడు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ చక్రం తిప్పారు. ఆయన పార్లమెంట్ ఉభయ సభల్లో మెంబర్ గా పనిచేసిన కీర్తిని సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు నెగ్గారు. ఇక వుడా చైర్మన్ గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా విశేష సేవలు అందించారు. ఆయన రాజకీయ శిష్యులు ఇప్పటికీ మూడు జిల్లాల్లో ఉన్నారు. అయితే ఆయన కుటుంబంలో మాత్రం మూడవ తరం వారసుడిగా ఎదిగేందుకు మనుమడు శ్రీవాత్సవ్ గట్టిగానే కృషి చేస్తున్నారు.
అవే మైనస్ …
సత్యనారాయణ కుమారుడిగా ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉడా చైర్మన్ గా పనిచేశారు. ఇంకా ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనుకున్న వేళ కరోనా కారణంగా ఆయన కన్నుమూశారు. మరి తండ్రి తాతల వరసత్వాన్ని నిలబెట్టడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని శ్రీ వాత్సవ్ రంగంలోకి దిగారు. ఆయనకు కేవలం వారసత్వమే ఆస్తి తప్ప మిగిలినవి అన్నీ శ్రీ వాత్సవ్ కి మైనస్ గానే ఉన్నాయి. కుల బలం లేకపోవడం, ఆర్ధికంగా కూడా పెద్దగా ఏమీ కాకపోవడంతో ఆయన రాజకీయ గమనం మీద నీలి నీడలు పడేలా చేస్తోంది.
అభయం ఇచ్చారా…?
ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ అంటే జగన్ కి బాగా ఇష్టం. అలాగే విశాఖలో ఉన్న విజయసాయిరెడ్డికి కూడా ఆ కుటుంబం మీద సానుభూతి ఉంది. మరి వారిద్దరే ఏదో చేయాలి అన్నది కూడా మాటగా ఉంది. ఈ మధ్యనే తాడేపల్లిలోని జగన్ నివాసానికి దివంగత శ్రీనివాస్ కుటుంబం మొత్తం వెళ్ళి తమ గోడు చెప్పుకుంది. విశాఖ రాజకీయాల్లో తమకూ ఒక చోటు కల్పించాలని కూడా విన్నవించుకుంది. విశాఖ సౌత్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వచ్చేసారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, పైగా బీసీ. బలమైన నేత. మరి ఈ నేపధ్యంలో వైసీపీ హై కమాండ్ ఆయన్ని కాదని ఏమైనా ఆఫర్ ఇస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.
అలా జరిగేనా?
జగన్ విషయం తీసుకుంటే మాట ఇస్తే చేస్తారని పేరు. ఈ మధ్యనే కర్నూల్ జిల్లాకు చెందిన చల్లా రామక్రిష్ణారెడ్డి చనిపోతే ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అలాగే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపొతే కుమారుడు కళ్యాణ చక్రవర్తిని ఎమ్మెల్సీ చేశారు. ఇపుడు ద్రోణంరాజు కుటుంబం కూడా అలాంటి హామీనే కోరుకుంటోంది. అయితే అక్కడ సామాజిక రాజకీయ సమీకరణలు వేరు. విశాఖలో వేరు. పైగా శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన కుటుంబాన్ని కాదని ముందుకు వెళ్ళినా కూడా వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కేవలం నైతికత ఆధారంగానే న్యాయం చేయాలి.
విశాఖ కార్పొరేషన్ లో…
విశాఖ కార్పోరేషన్ లో కో ఆప్షన్ మెంబర్ గా శ్రీ వాత్సవ్ కి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారు అన్న మాట అయితే ఉంది. అది కాకపొతే పొలిటికల్ గా ఇక డోర్స్ క్లోజ్ అన్నది కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా తాత తండ్రి మాదిరిగా శ్రీ వాత్సవ్ ఎదగాలంటే అందుకు సొంతంగానే పరిశ్రమించాల్సి ఉంటుందని సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి. చూడాలి మరి విశాఖ రాజకీయాల్లో ద్రోణంరాజు ఫ్యామిలీ ఉనికి చాటుకుంటుందా లేదా అన్నది.

