త్రిమూర్తుల యాక్షన్ ప్లాన్ కి బిగ్ బ్రేక్ ?.. కత్తెర పడిందా?
కరోనా కాదు కానీ అందరి ఫ్యూచర్ ని కన్ఫ్యూజన్ చేసి పారేసింది. ఏపీ వరకూ చూసుకుంటే చాలా మంది ఆశలను ఆవిరి చేసేసింది. ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని [more]
కరోనా కాదు కానీ అందరి ఫ్యూచర్ ని కన్ఫ్యూజన్ చేసి పారేసింది. ఏపీ వరకూ చూసుకుంటే చాలా మంది ఆశలను ఆవిరి చేసేసింది. ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని [more]

కరోనా కాదు కానీ అందరి ఫ్యూచర్ ని కన్ఫ్యూజన్ చేసి పారేసింది. ఏపీ వరకూ చూసుకుంటే చాలా మంది ఆశలను ఆవిరి చేసేసింది. ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వరకూ అందరి పొలిటికల్ యాక్షన్ ప్లాన్ లకు బిగ్ బ్రేక్ వేసేసింది. వారి కోరికలకు కళ్ళెం వేసేసింది. ఇంకా చెప్పాలంటే ఒక్క సారిగా చల్లని నీళ్ళు తెచ్చి చల్లేసింది. లేకపోతే 2024 ఎన్నికల కోసం కలలు కన్నారు. వాటిని ఎలా నిజం చేయాలనుకున్నారు, కానీ కరోనా మహమ్మారి చిరిగి చేటను చేసింది. ఇప్పట్లో ఎవరినీ ఏమీ చేయనీయకుండా బందీలను చేసింది. దాంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందంతే.
పవన్ అలా….
జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్న రెండు మూడేళ్ళు వరసగా సినిమాలు చేసుకోవాలని 2020లో ఓ శుభ ముహూర్తాన ముఖానికి రంగు వేసుకున్నారు. ఆయన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ ఏడాది కనీసంగా రెండు సినిమాలు పూర్తి చేయాలి. మూడవది పట్టాలెక్కించాలి. ఇక వచ్చే ఏడాది కూడా ఇదే జోరులో మరో మూడు సినిమాలు చేయాలి. ఇలా బ్యాక్ టు బ్యాక్ అర డజన్ సినిమాలు అయినా చేసి 200 కోట్ల రూపాయలను వెనకేసుకోవాలనుకున్నారుట. ఆ మొత్తాన్ని రాజకీయ పెట్టుబడిగా పెట్టి 2024 ఎన్నికల బరిలో దిగాలన్నది ఆయన ప్లాన్. అయితే కరోనా కారణంగా ఇప్పట్లో సినిమాలు మొదలయ్యే ఛాన్స్ లేదు. మొత్తానికి ఈ ఏడాదిలో ఒక సినిమాను మాత్రమే పవన్ పూర్తి చేస్తారేమో. ఇక కరోనా దెబ్బతో పారితోషికాలు కూడా భారీగా కటింగ్ అవుతున్నాయి. అంటే సగానికి సగం తగ్గించుకోవాలి. ఆ విధంగా సినిమాల ద్వారా ఆర్జించి పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసుకుందామన్న పవన్ కల్యాణ్ ఆశలు ఆగిపోయినట్లేనని అంటున్నారు.
బాబుకు దెబ్బే …..
చంద్రబాబుకు ఎన్నికల్లో ఎపుడూ మదుపు పెట్టేవారంతా ఇపుడు కరోనా చిక్కుల్లో పడ్డారు. వీరంతా కోలుకోవడానికి మూడు నాలుగేళ్ళ సమయం పట్టవచ్చు. అంటే టీడీపీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గాన్ని కరోనా ఎడా పెడా దెబ్బ కొట్టేసింది. ఆ వర్గం తనను తాను సర్దుకునేలోగానే 2024 ఎన్నికలు వచ్చేస్తాయి. మరి చంద్రబాబు పార్టీకి ఆర్ధికంగా దన్ను గతంలో మాదిరిగా ఉండకపోవచ్చు అంటున్నారు. అంతే కాదు, బాగా తగ్గినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలు పసుపు పార్టీని బెంబేలెత్తించేవే. అధికార వైసీపీని ఢీ కొట్టి నిలబడాలంటే 2024 ఎన్నికల్లో భారీ బందోబస్తుతో దిగాలి. దాని కోసం చంద్రబాబు వేసుకున్న అన్ని రకాలైన పధకాలకు కూడా ఇపుడు కరోనా పెద్ద కత్తెర వేసేసింది.
జగన్ కి అలా….
ఇక అధికార పార్టీకి కరోనా ఇబ్బందులు మామూలుగా ఉండవు. సంక్షేమ పధకాలకే మొత్తం బడ్జెట్ సొమ్ము ఖర్చు చేస్తున్న జగన్ కి రానున్న నాలుగేళ్ళూ ఇబ్బందులు తప్పవు. కరోనా వల్ల ఆర్ధిక పతనం ఏపీలో వేగంగా ఉంటుంది. కోలుకునేలోగానే 2024 సాధారణ ఎన్నికలు దూసుకు వచ్చేస్తాయి. ఇక రాజధాని, పోలవరం వంటివి పూర్తి చేసి చూపిస్తెనే జగన్ అభివృధ్ధి మంత్రం ఫలిస్తుంది. పరిస్థితి చూస్తే అంతా ఉల్టా సీదాగా ఉంది. మొత్తం మీద జగన్ కూడా ఎన్నో ఆలోచనలతో 2024 ఎన్నికల కోసం తయారు చేసుకున్న ప్రణాళికలు తల్లకిందులవక తప్పదు. అయితే జగన్ పార్టీకి ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ అధికార పార్టీగా ఉండడం. ఆ ధీమాతోనే 2024 ఎన్నికలకు కరోనా అనంతరం కొత్త యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసుకోవాలి.

