చింతమనేని మారిపోయాడా..?
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో తమకు తిరుగులేదని భావించిన నాయకులు చాలా మంది మట్టి కరిచారు. ఈ క్రమంలోనే [more]
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో తమకు తిరుగులేదని భావించిన నాయకులు చాలా మంది మట్టి కరిచారు. ఈ క్రమంలోనే [more]

తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో తమకు తిరుగులేదని భావించిన నాయకులు చాలా మంది మట్టి కరిచారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం నుంచి వరుస విజయాలను కైవసం చేసుకున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కూడా తాజా ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూశారు. వాస్తవానికి ఆయన ఓడిపోతారని ఆయన అనుచరవర్గం ఊహించలేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావడంతో ఖచ్చితంగా గెలిచి తీరుతారని అందరూ అనుకున్నారు. అయితే, వైసీపీ నుంచి బరిలో నిలిచిన కొఠారు అబ్బయ్య చౌదరి దెబ్బతో చింతమనేనికి ఓటమి తప్పలేదు.
సవాల్ కు ఆన్సర్ లేదా…?
చింతమనేని ప్రభాకర్ ఓటమికి… కొఠారు గెలుపునకు మధ్య చాలా కారణాలు ఉన్నా వ్యక్తిత్వమే ప్రధాన కారణం. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తయిన తర్వాత కూడా చింతమేనేని ఇప్పటి వరకు బాహ్య ప్రపంచంలోకి రాలేదు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నిత్యం ఏదో ఒక విధంగా మీడియాలో చోటు సంపాయించుకునేవారు. ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్ఠలతో మీడియా దృష్టిని ఆకర్షించి సంచలనాలకు వేదికగా మారారు. ఇక, ఇప్పు డు మాత్రం ఓటమి ఎఫెక్ట్‌తో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అంతేకాదు, ఓటమిని ఇప్పటికీ కూడా ఆయన జీర్ణించుకోలేక పోతుండడం గమనార్హం. ఎన్నికలకు ముందు పవన్, జగన్ వచ్చి తనపై పోటీ చేసినా గెలుస్తానని.. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఓపెన్ సవాల్ చేసిన చింతమనేని ఇప్పుడు దీనికి ఏమని ఆన్సర్ ఇస్తాడు ? అని వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
క్యాడర్ పై కారాలు..మిరియాలు….
ఓటమి తర్వాత తనను కలిసేందుకు ఎవరైనా ఇంటికి వచ్చినా…చింతమనేని ప్రభాకర్ చిర్రుబుర్రులాడుతున్నారు. మీకు నేను ఎంతో చేశాను.. అయినా మీరు నాకు ఓట్లేయలేదు.. అంటూ.. వచ్చిన వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో ఇప్పుడు చింతమనేనిని పరామర్శించేందుకు వెళ్లేవారు కూడా తగ్గిపోయారు. దీనికితోడు తాను అధికారంలో ఉండగా.. స్థానిక రైతులకు మేలు చేకూర్చే విధంగా తమ్మిలేరుకు పైపు లైన్లు వేయించారు. అయితే, ఓటమిత ర్వాత ఆయన ఈ పైపులను బలవంతంగా పీకించేసి తన ఇంటికి తీసుకుపోయారు. అయితే, ఆగ్రహించినరైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. వాటిని తెచ్చుకుని తిరిగి బిగించుకున్నారు. వాటిని తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకున్నామని వారు చింతమనేనిపై ఫైర్ అవ్వడం… దీనిపై పోలీసు కేసు నమోదు అవ్వడం కూడా జరిగింది.
సొంత పార్టీ నేతలే….
ఇక చింతమనేని ప్రభాకర్ తన పదేళ్ల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో చేసిన దందాలు, అక్రమాలపై కేసులను ఈ ప్రభుత్వం తిరిగి తోడుతుందన్న వార్తలు రావడంతో చింతమనేని మరింత హర్ట్ అయ్యారని అంటున్నారు. మరోపక్క, వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరి మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలు, నవరత్నాల అమలు వంటివాటిపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరిని కలుపుకుపోతున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలే కాకుండా సొంత పార్టీ నేతలపై సైతం కయ్కయ్లాడే చింతమనేనిని ఇప్పుడు సొంత పార్టీ నేతలై లైట్ తీస్కొంటున్నారు.