అయిపోయిందిగా…లెక్క సరిపోయినట్లే?
గంటా శ్రీనివాసరావు రేపు వైసీపీలో చేరనున్నారు. దీంతో ఇప్టటికి టీడీపీ నుంచి ఐదుగురు వైసీపీలో అనధికారికంగా చేరినట్లవుతుంది. అంటే తెలుగుదేశం బలం ప్రస్తుతం 18కి పడిపోయింది. దీంతో [more]
గంటా శ్రీనివాసరావు రేపు వైసీపీలో చేరనున్నారు. దీంతో ఇప్టటికి టీడీపీ నుంచి ఐదుగురు వైసీపీలో అనధికారికంగా చేరినట్లవుతుంది. అంటే తెలుగుదేశం బలం ప్రస్తుతం 18కి పడిపోయింది. దీంతో [more]

గంటా శ్రీనివాసరావు రేపు వైసీపీలో చేరనున్నారు. దీంతో ఇప్టటికి టీడీపీ నుంచి ఐదుగురు వైసీపీలో అనధికారికంగా చేరినట్లవుతుంది. అంటే తెలుగుదేశం బలం ప్రస్తుతం 18కి పడిపోయింది. దీంతో చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో ఇక ఉన్న ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష హోదాను దెబ్బతీసేందుకే వైసీపీ పదినెలలుగా ప్రయత్నాలుచేస్తుంది.
ఇప్పటికే నలుగురు…..
తొలి దశలో వల్లభనేని వంశీ వచ్చారు. ఆ తర్వాత మద్దాలిగిరి పార్టీ కి చేరువయ్యారు. అనంతరం ఊహించని విధంగా కరణం బలరాం వైసీపీకి దగ్గరయ్యారు. ఇక మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీీపీకి మద్దతుగా నిలచారు. తాజాగా ఇక గంటా శ్రీనివాసరావు కూడా వైసీపిలో చేరుతుండటంతో చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండిపడినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.
ఐదుగురికి ప్రత్యేక గుర్తింపు….
ఈ ఐదుగురికి శాసనసభలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చే అవకాశముంది. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను దెబ్బతీసేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోకపోయినా టీడీపీకి మాత్రం దూరం చేసే వ్యూహాన్ని రచించింది. వారిపై అనర్హత వేటు పడకుండా వారి కుమారులకు పార్టీ కండువాలను కప్పుతూ కొత్త మార్గానికి తెరలేపింది.
హోదా పోతుందా?
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీరి ఐదుగురికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి చంద్రబాబు ప్రతిపక్ష హోదాను దెబ్బతీయాలన్నది వైసీపీ ఆలోచనగా కన్పిస్తుంది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. మరికొందరు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరి చేరికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండిపడే అవకాశాలున్నాయి. మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన హోదాను చంద్రబాబు కాపాడుకుంటారేమో చూడాలి.

