ఫోన్ తాడే పాము అవుతోందా..?
దరిద్రం పట్టుకుంటే ఫోన్ తాడు కూడా ఉరి తాడు అవుతుంది. ఆఖరుకు పాముగా కూడా మారుతుంది. లేకపోతే ఎక్కడివీ సినిమాటిక్ తెలివితేటలు. లేని పోని విషయాలు నాలుగు [more]
దరిద్రం పట్టుకుంటే ఫోన్ తాడు కూడా ఉరి తాడు అవుతుంది. ఆఖరుకు పాముగా కూడా మారుతుంది. లేకపోతే ఎక్కడివీ సినిమాటిక్ తెలివితేటలు. లేని పోని విషయాలు నాలుగు [more]

దరిద్రం పట్టుకుంటే ఫోన్ తాడు కూడా ఉరి తాడు అవుతుంది. ఆఖరుకు పాముగా కూడా మారుతుంది. లేకపోతే ఎక్కడివీ సినిమాటిక్ తెలివితేటలు. లేని పోని విషయాలు నాలుగు ఏర్చి కూర్చి వార్తలుగా అనుకూల మీడియా వండి వార్చితే దాన్ని పట్టుకుని ఏకంగా ప్రధానికే లేఖ రాయడానికి చంద్రబాబు తయారైపోవడాన్ని ఎలా చూడాలి. ఇక్కడ లాజిక్ కూడా చంద్రబాబు మిస్ అయ్యి మరీ రెచ్చిపోవడాన్ని ఏమనుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చంద్రబాబు అంటున్నారు, కానీ ఎవరితో చెప్పరు, ఆధారాలు లేవు, గాలి కబుర్లతో లేఖలు దట్టిస్తే ప్రధాని సీన్లోకి వస్తారా. ఏపీలో అధికార పార్టీ మీద యాక్షన్ కి దిగుతారా. అంటే బాబు అత్యాశ ఏ రేంజిలో ఉందో తెలియ చెప్పే ఉదంతం ఇది.
పాయింటేగా…?
న్యాయమూర్తుల ఫోన్ ట్యాప్ అవుతోందని చంద్రబాబు గారి ఆవేదన, ఆరోపణ. సరే కాసేపు అలాగే అనుకున్నా న్యాయ వ్యవస్థ సర్వ స్వంతంత్రమైనది. అంత తేలిగ్గా ఈ విషయాన్ని ఎవరైనా వదిలిపెడతారా. అందుకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు కోర్టులు చూసుకునే దానికి మీకెందుకు ఆరాటం బాబూ అని. చంద్రబాబు మాత్రం ఏపీలో ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇచ్చి జాతీయ స్థాయిని ఆకర్షించడానికి ఇలా లేఖాస్త్రం సంధించారనుకోవాలి. అదే విధంగా పనిలో పనిగా మోడీ గారిని కీర్తించడానికి ఉపయోగించుకున్నారనుకోవాలి. కానీ జీవీఎల్ లాగిన పాయింట్ తో మొత్తం బూమరాంగ్ అయింది.
అలా చేయగలరా..?
ఇక వైసీపీ సర్కార్ ఎంత తెగించినా ఏకంగా న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసే దుస్సాహసానికి ఒడికడుతుందా. అలా చేసి తమ కాళ్ల కిందకు నీళ్లు తెచ్చుకుంటుందా. 1985 ప్రాంతంలో ఫ్యోన్ ట్యాపింగ్ కేసులోనే అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి రామక్రిష్ణహెగ్డే రాజీనామా చేయాల్సివచ్చింది. అంటే ఫ్యోన్ ట్యాపింగ్ ఎంతటి ప్రమాదకరమో వైసీపీ పెద్దలకు తెలియకుండా ఉంటుందా. పోనీ ఆ ట్యాపింగ్ చేసి చేసి న్యాయమూర్తుల మీదనే చేస్తారా. అలా తమ నెత్తిన కొరివిని తామే పెట్టుకుంటారా. ఇవన్నీ లాజిక్ గా ఆలోచిస్తే వచ్చే ప్రశ్నలు. ఇక ముందే చెప్పుకున్నట్లు ఫోన్ ట్యాప్ అయిన న్యాయమూర్తులు తాముగా ప్రభుత్వం మీద కేసు పెడితే బుక్ అయ్యేది ఎవరో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.
టీడీపీకే చుట్టేస్తుంది ….
ఇపుడు వైసీపీ తెలివిగానే ఈ కేసు విషయంలో వ్యవహరిస్తోంది అనిపిస్తోంది. ఎందుచేతనంటే డీజీపీ చంద్రబాబుకు నేరుగా లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అడిగారు. ఇక మరో వైపు బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు అధారాలు లేని లేఖల మీద మండిపడ్డారు. నిజంగా ప్రధాని ఆఫీస్ బాబు లేఖను సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేస్తే టీడీపీయే ఇబ్బందులో పడే ప్రమాదమూ ఉంది. అదెలా అంటే లేనిపోని వార్తలు రాసి మీడియా హల్ చల్ చేస్తే దాన్నే ఆధారంగా పట్టుకుని చంద్రబాబు లేఖ రాయడంతో దీన్ని చిన్న పిల్లాటగా ఎవరూ చూడరు, రాసిన మీడియాతో పాటు, బాబుని ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలనుకుంటే చిక్కుల్లో పడేది టీడీపీనే. అవును కానీ ఏ న్యాయమూర్తి ఫోన్ అయినా ట్యాప్ అయితే ఆయన తన జ్యూడీషియరీ పవర్స్ ఉపయోగించుకుని ఏం చేయాలో అది చేస్తారు కానీ మీడియాకు వార్తగా చెప్పరు కదా. పైగా పవర్లో లేని టీడీపీ ద్వారా ఎవరైనా ఎందుకు పోరాటం చేయాలనుకుంటారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన చంద్రబాబుకు ఫోన్ తాడే పాముగా మారుతుందా.. చూడాలి మరి.

