ఈసారి ఆషామాషీ కాదట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేక కష్టాల్లో ఉన్నారు. అసలే పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ చతికిలపడిపోయింది. ఏపీలో కొద్దో గొప్పో ఆశలున్నా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేక కష్టాల్లో ఉన్నారు. అసలే పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ చతికిలపడిపోయింది. ఏపీలో కొద్దో గొప్పో ఆశలున్నా [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేక కష్టాల్లో ఉన్నారు. అసలే పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ చతికిలపడిపోయింది. ఏపీలో కొద్దో గొప్పో ఆశలున్నా వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా వస్తే ఇక పార్టీని మూసేయాల్సిందే. అందుకే చంద్రబాబు ప్రతి అడుగు ఆచితూచి వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్థికంగా పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. పార్టీకి ఫండ్ ఇచ్చే వారు కూడా వెనక్కు తగ్గుతున్నారు.
నిధుల సమస్య…
వచ్చే ఎన్నికల నాటికి నిధుల సమస్య మరింత ఎక్కువవుతుంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, చంద్రబాబు, లోకేష్ టూర్లకే పార్టీ నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. అందుకే వీలయినంత తక్కువగా చంద్రబాబు కార్యక్రమాలను రూపొందించు కుంటున్నారు. ఇక అభ్యర్థుల విషయంలోనూ ఈసారి రాజీ పడే ప్రసక్తి ఉండకూడదని చంద్రబాబు నిర్ణయించారు. అన్ని రకాలుగా బలవంతులైన వారికే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
బలంగా ఉన్నవారినే….
జగన్ ను ఈసారి ఎన్నికల్లో ఢీకొట్టడం ఆషామాషీ విషయం కాదు. జగన్ ఆర్థికంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్నారు. తమ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న బీసీ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టారు. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ గా బలమైన నేతలే ముందుకు రావాలని చంద్రబాబు చెబుతున్నారు. పార్టీ నిధుల కోసం వేచి చూసే నేతలు అవసరం లేదని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పదలచుకున్నారు.
నిధుల సమీకరణ కూడా….?
ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బీజేపీ నుంచి సహకారం అందదు. గత దశాబ్దాలుగా టీడీపీకి ఆర్థికంగా సాయం చేస్తున్న వారు సయితం ఇప్పుడు చేతులెత్తేశారు. నిధుల సమీకరణ కూడా పెద్దగా ఉండదు. దీంతో నిధుల సమస్య తీవ్రంగా ఉందని, రానురాను ఇది అతిపెద్ద సమస్యగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీ పడకుండా అన్ని రకాలుగా ఫిట్ అయిన వారికే టిక్కెట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది.

