టాప్ టూ బాటమ్ ఫ్రస్టేషన్… ఎందుకలా?
తెలుగుదేశం పెద్ద చంద్రబాబు. గత రెండేళ్ళుగా జనాల మీద నోరు పారేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత మొదలైన ఈ దూషణల పర్వం స్థానిక ఎన్నికల వేళకు [more]
తెలుగుదేశం పెద్ద చంద్రబాబు. గత రెండేళ్ళుగా జనాల మీద నోరు పారేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత మొదలైన ఈ దూషణల పర్వం స్థానిక ఎన్నికల వేళకు [more]
తెలుగుదేశం పెద్ద చంద్రబాబు. గత రెండేళ్ళుగా జనాల మీద నోరు పారేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత మొదలైన ఈ దూషణల పర్వం స్థానిక ఎన్నికల వేళకు పరాకాష్టకు చేరుకుంది. విశాఖ వస్తే చాలు అక్కడి జనాలను తిడతారు. విజయవాడ వెళ్తే జనాలను ఇళ్ళలోనే ఉండిపోయే చేతకానివాళ్ళు అంటారు. గుంటూరు వెళ్ళి అక్కడి ప్రజలను జైలుకు వెళ్లమంటారు. ఇంతకీ చంద్రబాబుకు ఏమైంది. ఇదే అందరిలోనూ కలుగుతున్న అతి పెద్ద సందేహం. ఇక్కడ ఇంకో మాట చంద్రబాబు ఒక్కరికే కాదు, టీడీపీలో పెద్దలు చాలా మందికి కూడా జనాలను చూస్తే అలాగే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది మరి.
జనమేంచేస్తారు…?
ప్రజాస్వామ్యంలో నచ్చినవారిని ఎన్నుకునే హక్కు జనాలకు ఉండదా. వారు 2014 ఎన్నికల్లో టీడీపీని ఎన్నుకుంటే మురిసిన చంద్రబాబుకు ఇపుడు అదే జనం జగన్ కి జేజేలు పలికితే మాత్రం మంటగా ఉంటోంది. అమరావతి రాజధాని గురించి జనాలకు పట్టడంలేదు, వారు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం లేదు అని చంద్రబాబు గారుతెగ ఆక్రోసిస్తున్నారు. అమరావతి కొరకు పోరాటానికి మీరు ఎందుకు బయటకు రారు అంటూ నిగ్గదీస్తున్నారు. రెండు రోజులు జైలులో ఉంటే తప్పేంటి అని కొత్త మాటలే మాట్లాడుతున్నారు. రెండు వేల రూపాయలు ఇస్తే ఎవరికైనా ఓటేస్తారు అంటూ తన అక్కసును అంతా వెళ్లగక్కుతున్నారు.
ఎందుకు తిరగబడాలి….?
ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జనాలు తిరగబడే పరిస్థితి ఉంటుందా. ప్రజలకు ఓటు అన్నది ఒక వజ్రాయుధం. దాంతోనే వారు తిరుగులేని జవాబు చెబుతారు. రాజకీయ పార్టీలు ప్రజలను చైతన్యపరచడం వరకూ మాత్రమే తమ పాత్రకు పరిమితం కావాలి. అంతే తప్ప తమ వెంట తిరగాలని, తమ అజెండాను నెత్తిన పెట్టుకుని జైళ్లకు పోవాలని అడిగే హక్కు కానీ గద్దించే పరిస్థితి కానీ ఏ మహా నాయకుడుకీ లేదన్న సంగతి చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో తప్పులు చేసింది చంద్రబాబు అయితే జనాలు ఎందుకు బయటకు వస్తారు అన్నది ఇక్కడ ప్రశ్న.
ఈయన అంతేగా …?
ఇక విజయనగరం మహారాజుగా పేరు సంపాదించుకున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అయితే తమ మీద పూలు చల్లారన్న కారణంతో ఏకంగా ఒక మహిళను నడి రోడ్డు మీద చెంప దెబ్బ కొట్టారు. ఆయన ఫస్ట్రేషన్ అలా ఉందని ప్రత్యర్ధి పార్టీలు అనుకుంటే తప్పేంటి. ఇక దానికంటే ముందు చంద్రబాబు గారి బావమరిది బాలయ్య హిందూపురంలో ఇలాగే తన అభిమానికి చెంప దెబ్బలు బహుమానంగా ఇచ్చారు. వీరందరి తీరు చూస్తూంటే టీడీపీ టాప్ టూ బాటమ్ వరకూ తీవ్ర అసహనంతో కొట్టుమిట్టాడుతోందా అన్న డౌట్ అయితే వస్తోంది. అదే నిజమైతే మాత్రం ఓటమి కంటే అది పెద్ద షాక్ అది. ఓటమికి మళ్ళీ కష్టపడితే గెలుపు మందు ఉంది కానీ అసహనం హద్దు మీరితే మాత్రం దానికి ఏ రకమైన పరిష్కారం లేదంతే.