నిస్సహాయతతోనే ఆ నిర్ణయాలా?
చంద్రబాబు వరస తప్పులు చేస్తున్నారు. వయసు మీదపడటంతో ఆ తప్పులు చేస్తున్నారా? లేక నిస్సహాయతతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ [more]
చంద్రబాబు వరస తప్పులు చేస్తున్నారు. వయసు మీదపడటంతో ఆ తప్పులు చేస్తున్నారా? లేక నిస్సహాయతతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ [more]
చంద్రబాబు వరస తప్పులు చేస్తున్నారు. వయసు మీదపడటంతో ఆ తప్పులు చేస్తున్నారా? లేక నిస్సహాయతతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని బలంగా కోరుకుంది. దీనివల్ల పంచాయతీ పరిధిలో రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీకి అడ్వాంటేజీ అవుతుందని చంద్రబాబు భావించారు. కానీ వాస్తవంగా చూస్తే ఏకగ్రీవాలతో పాటు తొలిదశ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఎక్కువ చోట విజయం సాధించడం విశేషం.
మోదీకి దగ్గరవ్వాలని….
ఇక కరోనా సమయంలో ప్రధాని మోదీ చంద్రబాబుకు లేఖ రాశారు. కరోనాను అరికట్టేందుకు తాను ప్రత్యేంకగా సలహా బృందాన్ని ఏర్పాటు చేస్తానని, ఆ సూచనలను ఎప్పటికప్పడు తెలియజేస్తానని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. దీంతో బీజేపీకి సులువుగా దగ్గరవ్వవచ్చని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే పదే పదే మోదీపై నాడు ప్రశంసలు కురిపించారు. ఒకవైపు జగన్ ను కరోనా విషయంలో విమర్శలు చేస్తూనే మరోవైపు మోదీని ఆకాశానికెత్తారు.
మోజు లేకపోయినా…..?
కానీ మోదీ, బీజేపీ మీద ఇదివరకటి మోజు ఇప్పుడు ప్రజల్లో లేదు. 2019 ఎన్నికల నాటికంటే ఇప్పుడు బీజేపీపైన వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు మాదిరి కేంద్ర ప్రభుత్వంపై పోరాడితే చంద్రబాబుకు అడ్వాంటేజీగా మారే అవకాశముంది. బీజేపీ మీద భ్రమలు తొలగిపోవడం, బీజేపీ ప్రధానంగా ఏపీలో టీడీపీనే డ్యామేజీ చేస్తున్నా చంద్రబాబు పన్నెత్తు మాట అనకపోవడం విడ్డూరమంటున్నారు.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కూడా…..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కూడా చంద్రబాబు పెద్దగా విమర్శలు చేయలేదు. ఏదో మమ అని పించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా చంద్రబాబు అందిపుచ్చుకోలేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే, దానిని ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనే చంద్రబాబు ఆయన పార్టీ విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు నిర్ణయాలను పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పార్టీ నిధులు విషయంలో ఇబ్బందులు రాకుండా ఈ వరస తప్పిదాలు చేస్తున్నారన్న టాక్ ఉంది.