పెద్దమనుషులంతా ఎటూ వెళ్లారో? ఏడాది గడుస్తున్నా?
టీడీపీ ఇంకా నిర్వేదం నుంచి బయటపడలేదు. ఏడాది గడుస్తున్నా ఇంకా నేతలు హ్యాంగోవర్ నుంచి బయటపడటం లేదు. చంద్రబాబు లాక్ డౌన్ లో రెండు నెలలు ఉండి [more]
టీడీపీ ఇంకా నిర్వేదం నుంచి బయటపడలేదు. ఏడాది గడుస్తున్నా ఇంకా నేతలు హ్యాంగోవర్ నుంచి బయటపడటం లేదు. చంద్రబాబు లాక్ డౌన్ లో రెండు నెలలు ఉండి [more]

టీడీపీ ఇంకా నిర్వేదం నుంచి బయటపడలేదు. ఏడాది గడుస్తున్నా ఇంకా నేతలు హ్యాంగోవర్ నుంచి బయటపడటం లేదు. చంద్రబాబు లాక్ డౌన్ లో రెండు నెలలు ఉండి బయటపడి పార్టీ లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎవరూ బయటకు రాకపోవడం ఆందోళన కల్గించినా ఏడాది తర్వాతైనా బయటకు వస్తారన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
క్లీన్ స్వీప్ చేసిన జిల్లా…..
పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకుంటే.. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా ఇది. ఇక్కడ గత ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అందరూ కాలరెగిసిన వాళ్లే. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారు. కష్టకాలంలో పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. అంతేకాదు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా వాళ్లంతా దూరంగా ఉంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు….
జిల్లాలో మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు తదితరులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హవా చూపేవారు. కానీ గత ఏడాది కాలంగా వీరంతా మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అధికార పార్టీ కేసుల భయం కావచ్చు, పార్టీకి ఖర్చు చేయాల్సి వస్తుందన్న భయం కావచ్చు మొత్తం మీద వీరంతా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.
యాక్టివ్ గా లేకపోవడంతో….
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ వీళ్లెవరూ బయటకు రాలేదు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ సమయంలో క్యాడర్ కు, ద్వితీయ శ్రేణి నేతలకు ధైర్యం చెప్పాల్సిన నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాల్లో గెలిచిన నిమ్మల రామానాయుడు తప్ప మరెవ్వరూ యాక్టివ్ గా లేరు. దీంతో చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. పట్టున్న జిల్లాలో తిరిగి పార్టీలో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూడాల్సి ఉంది.
.

