అదంటేనే బెరుకు… అందుకే దాడి చేస్తున్నారట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేరళ వైపు చూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేరళ లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ లో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేరళ వైపు చూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేరళ లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ లో [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేరళ వైపు చూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేరళ లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ లో పాటించడం లేదని జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లగా నియమించారని ఆరోపణలు ఆయన మొదటి నుంచి చేస్తున్నారు.
కేరళ ఉదాహరణగా….
కానీ కేరళలో ఎలాంటి వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే 17 రకాల నిత్యావసర వస్తువులను ఇంటింటికి ఎలా అందించగలిగారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లక్ష మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ రేషన్ ను ఎందుకు ఇంటింటికీ అందించలేకపోయిందని ఆయన నిలదీస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కరోనా మరింత విజృంభించే అవకాశముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లేఖలతో ప్రశ్నలు…..
గత ఇరవై రోజులుగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు దాదాపు 20 లేఖలకు పైగానే రాశారు. అందులో ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థనే ఆయన తప్పుపడుతున్నారు. వాలంటీర్లు విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. వాలంటీర్ల సాయంతో పార్టీని పటిష్టం చేసుకునే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు తప్పించి ప్రజోపయోగమైన పనులు చేపట్టడం లేదని ఆయన వరస విమర్శలు చేస్తున్నారు.
ఎందుకంత భయమంటున్న వైసీపీ….
వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని, అందుకే దానిపై బురద జల్లే కార్యక్రమాన్ని అదే పనిగా పెట్టుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వాలంటీర్లు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారంటున్నారు. జాతీయ మీడియా, కేంద్ర ప్రభుత్వం కూడా వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద కరోనా సమయంలో వాలంటీర్ల వ్యవస్థ రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలకు మెయిన్ టాపిక్ గా మారింది.

