చంద్రబాబు ఉండి ఉంటేనా? “నారా”… సామిరంగా?
చంద్రబాబుని ఏపీ ముఖ్యమంత్రి సీట్లో నుంచి దించేసి రాష్ట్ర ప్రజలు పెద్ద తప్పు చేశారా. ఆయన పదవిలో లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు, విపత్తు కరోనా రూపంలో [more]
చంద్రబాబుని ఏపీ ముఖ్యమంత్రి సీట్లో నుంచి దించేసి రాష్ట్ర ప్రజలు పెద్ద తప్పు చేశారా. ఆయన పదవిలో లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు, విపత్తు కరోనా రూపంలో [more]

చంద్రబాబుని ఏపీ ముఖ్యమంత్రి సీట్లో నుంచి దించేసి రాష్ట్ర ప్రజలు పెద్ద తప్పు చేశారా. ఆయన పదవిలో లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు, విపత్తు కరోనా రూపంలో జనాలను తరిమికొడుతోందా. అంటే పసుపు పార్టీ తమ్ముళ్ళ రాజకీయ భాష్యం మాత్రం ఇదే నిజం అంటోంది. ప్రపంచాన్ని వణికించి భారత్ గడ్డపైన కాలుమోపిన కరోన వైరస్ ని అదుపుచేయడం ఏ ఒక్కరి వల్లా కావడంలేదన్నది పచ్చి నిజం. ఈ విషయంలో పాలకులు చేయాల్సింది కట్టడి మాత్రమే. జనమే తమను తాము కాపాడుకోవాలి. అంటే ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాలి. అలా జనాలను చైతన్యం చేయాలి. కానీ జరుగుతున్నదేంటి.
జగన్ చదువు మీద….
ఇపుడు కరోనా మహమ్మారి మన పొలిమేరల్లోకి వచ్చి పెను సవాల్ చేస్తోంది. ఈ సమయంలో దాన్ని ఎలా నియంత్రించాలి. ఎలా మనలను కాపాడుకోవాలి అన్నది మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఆలోచన చేయాల్సిన పని. కానీ టీడీపీ తమ్ముళ్ళు మాత్రం అసలు విషయం వదిలేసి రాజకీయ రొచ్చుకు తెర తీయడమే విడ్డూరం. జగన్ ఏం చదువుకున్నారు. ఆయన కనీసం ఇంటర్ అయినా పాస్ అయ్యారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. జగన్ ఏమైనా డాక్టర్ అనుకుంటున్నారా? పారసైట్ మాల్ మందు బిళ్ళ చెప్పడానికి అంటూ ఎకసెక్కమాడుతున్నారు.
రాజీనామాల డిమాండ్….
ఇక జగన్ సర్కార్ ఒక్క క్షణం అధికారంలో ఉండవద్దుట. ఎందుకంటే ఏపీలో కరోనా వైరస్ లేదని చెప్పి జనాలను తప్పుదోవ పట్టించారట. వారం పది రోజుల క్రితం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారని నాడు నానా మాటలు అన్నందుకు జగన్, ఆయన మంత్రులు పదవులకు రాజీనామా చేయాలని సిక్కోలు తమ్ముడు కూన అంటున్నారు. కరోనా లేదని ఆనాడు అన్నారు, ఇపుడు చూశారుగా ఎలా వీర విహారం చేస్తోందో అంటూ కూన చెప్పడం వరకూ ఓకే. కానీ దీన్ని రాజకీయం చేయడం ఏంటో అర్ధం కావడం లేదు.
అమ్మేసుకున్నారా…?
ఇంకా కరోనాపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ లోనే ఉంది. ఇంతలోనే అవినీతి జరిగిందని తమ్ముళ్ళు పెద్ద నోరు చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వాటిలో నిధులు చేతులు మారాయని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇది సమయం సందర్భం కాకపోయినా కూడా జగన్ సర్కార్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని, ఈ జనాలకు ఆదుకునే దిక్కు లేదని జనాలను ఓ వైపు భయపెడుతూ తమ్ముళు పెడుతున్న మీడియా మీటింగులు ఆ పార్టీకి ఎంత మేలు చేస్తాయో కానీ జనాలను ఇంకా క్రుంగదీస్తున్నాయని అంటున్నారు.
బాబు కనుక ఉండి ఉంటే..?
ఇక కొసమెరుపుగా తమ్ముళ్ళు అంటున్న మరో మాట. ఇపుడు కనుక చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే కరోనాను దూకుడుని అరికట్టేవారని. హుదూద్ ని ఒంటిచేత్తో ఆపేసిన చంద్రబాబుకు కరోనా ఒక లెక్కలోకి రాదని కూడా ఆకాశమే హద్దుగా అతిశయం మాటలు మాట్లాడేస్తున్నారు జగన్ని 151 సీట్లతో గెలిపించి జనం తప్పుచేశారని కూడా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా అంటున్నారు. మొత్తానికి చూస్తూంటే కరోనా పైనా రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కలా నిలిచి పోరాడాల్సిన వేళ తెలుగు తమ్ముళ్ళ మాటలు చూస్తూంటే జగన్ అసమర్ధుడు అని లోకానికి చాటి చెప్పడానికి కరోనాను వాడేసుకుంటున్నారని అర్ధంవుతోంది. ఇది ఈ సమయంలో తగునా అన్నది తమ్ముళ్ళే ఆలొచించుకోవాలని మేధావులు అంటున్నారు.

