ఉత్త చేత్తో మిగిలారే? అంతా ఉత్తుత్తిదేనా?
చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయి పాతికేళ్ళు అవుతోంది. ఈ మధ్యకాలమంతా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే 2019 [more]
చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయి పాతికేళ్ళు అవుతోంది. ఈ మధ్యకాలమంతా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే 2019 [more]

చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయి పాతికేళ్ళు అవుతోంది. ఈ మధ్యకాలమంతా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే 2019 నాటి దారుణమైన పరిస్థితులు చంద్రబాబుకు ఇంతవరకూ ఎదురుకాలేదు. కనీసమాత్రంగా సీట్లు కూడా ఆయన పార్టీకి దక్కకపోవడంతో ఇటు ఎమ్మెల్సీలను, అటు, రాజ్యసభ సభ్యులను ఒక్కరినైనా పంపుకునేందుకు వీలులేని దారుణమైన వాతావరణం ఉంది. దాంతో తిరిగే కాలు తిట్టే నోరు సామెతను గుర్తు తెచ్చుకున్న చంద్రబాబు గెలవకపోయినా కూడా తన పార్టీ తరఫున రాజ్యసభకు వర్ల రామయ్యను పోటీ చేయించాననిపించుకున్నారు. తన సంతృప్తి కోసం బీ ఫారం కూడా ఇచ్చేశారు. మరి చంద్రబాబు రాజకీయ జీవితంలో రాజ్యసభ ఎన్నికల్లో ఇంతవరకూ ఎందరికో బీ ఫారాలు ఇచ్చారు, గెలిపించారు, తొలిసారిగా ఇలా జరిగింది పాపం అనుకోవాలి.
రెండు దశాబ్దాలుగా….
ఇదిలా ఉండగా చంద్రబాబు 2002 నుంచి ఇప్పటివరకూ పది సార్లు రాజ్య సభ ఎన్నికలు జరిగితే ఒక్క దళితుడినీ ఎంపీని చేయలేకపోయారు. కనీసం బీ ఫారాల వరకూ కధను నడిపించలేకపోయారు. ఆయన రాజ్యసభకు పంపిన వారిలే అధిక శాతం సొంత సామాజికవర్గానికి చెందినవారు ఉంటే, మిగిలిన వారు అగ్ర కులాల వారు, పెట్టుబడిదారులు, సొంత ప్రయోజనాలు కాపాడినవారే. దాంతో చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బీసీల గురించి……
చంద్రబాబు బీసీల గురించి మాట్లాడడాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తప్పుపడుతున్నారు. బీసీల విషయంలో బాబుకు చిత్తశుధ్ద్ధి ఉంటే కనీసం ఒక్కరినైనా రాజ్యసభకు పంపారా అని ఆయన నిలదీస్తున్నారు. అసలు చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు బాబు బీసీల జపం, ఎస్సీల జపం చేస్తున్నారని, అధికారం నుంచి దిగిపోయాకే వారు ఆయనకు గుర్తుకువస్తారని కూడా ధర్మాన సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఏపీలో అధికారికంగా బీసీ గణనకు ఆదేశాలు ఇచ్చారని, రానున్న రోజుల్లో రాజ్యాంగబధ్ధంగా బీసీలకు పదవులు దక్కుతాయని కూడా ధర్మాన చెబుతున్నారు.
ఇదే సీన్…..
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఇదే సీన్ మరో రెండు టెర్ములను కూడా చూడాల్సివస్తుంది. 2022, 2024ల్లో కూడా రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి. వైసీపీకి ఉన్న బంపర్ మెజారిటీ కారణంగా మరో ఎనిమిది మందిని రాజ్యసభకు పంపుకునే వీలుంటుంది. అదే సమయంలో టీడీపీకి ఇపుడున్న 23 మంది ఎమ్మెల్యేలు అయినా మిగులుతారో లేదో ఒక పెద్ద డౌట్. ఒక వేళ వారు ఉన్నా కూడా బాబు తన సంతృప్తి కోసం ఇలాగే మరో వర్ల రామయ్యనో, ఇంకోరినో బరిలోకి దించి బీసీలకు, మైనారిటీలకు టికెట్లు ఇచ్చామని ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఏది ఏమైనా తన చేత్తో ఎంతో మందిని రాజ్యసభ గడప ఎక్కించిన పెద్ద మనిషి చంద్రబాబు ఇలా చిన్నబోవడం మాత్రం టీడీపీకి దారుణమేనని అంటున్నారు.

