ఇక్కడ జీరో బ్యాలన్స్ అట
తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ తానేంటో నిరూపించుకోగలిగింది. అయితే గత ఆరేళ్ల నుంచి [more]
తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ తానేంటో నిరూపించుకోగలిగింది. అయితే గత ఆరేళ్ల నుంచి [more]

తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ తానేంటో నిరూపించుకోగలిగింది. అయితే గత ఆరేళ్ల నుంచి క్రమంగా తెలంగాణలో కనుమరుగవుతూ వస్తుంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉండే టీడీపీలో ఇప్పుడు నాయకత్వమే లేకపోవడం గమనార్హం. ఏపీలో నిన్న మొన్నటి వరకూ అధికారంలో ఉండటంతో కొంత నాయకులు తెలంగాణలోనూ పార్టీని బతికించుకునే ప్రయత్నాలు చేశారు.
ఏపీలో ఓటమితో…..
కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయినా తర్వాత తెలంగాణలో పార్టీ పూర్తిగా పడకేసిందనే చెప్పాలి. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఉన్నా లేనట్లే. ఇక అనేకమంది టీడీపీ తెలంగాణ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీని రక్షించుకుంటానని చెప్పిన చంద్రబాబు ప్రతి వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమై పార్టీ భవిష్యత్ పై వారికి చంద్రబాబు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
ఏపీలోనే ఖర్చుకు….
అయితే రెండు చోట్ల అధికారంలో లేకపోవడం, ఏపీలో పార్టీ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ఇక్కడ కార్యక్రమాలకు పార్టీ చేసేదేమీ ఉండదని చంద్రబాబు ఇటీవల తేల్చి చెప్పారట. అంతేకాదు పార్టీ కార్యాలయ సిబ్బంది ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారంటున్నారు. అయితే పూర్తిగా పార్టీని వదిలేయకుండా తెలంగాణలో టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు మరో ప్లాన్ వేశారు.
ఆర్థికంగా బలంగా ఉన్న వారికే….
పార్టీ అనుబంధ సంఘాలు, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ ఛార్జుల నియామకం చేపట్టాలని సూచించారట. ఈ కమిటీలకు ఆర్థికంగా బలవంతులనే నియమించాలని నిర్ణయించారట. అలా పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే నేతల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేయాలని సూచించారట. అంటే ఈ నాలుగేళ్లు తెలంగాణలో పార్టీ కార్యక్రమాల కోసం వారే ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. మరి ఎప్పటికైనా మంచిరోజులొస్తాయని, అప్పుడు తమకు పదవులు లభిస్తాయని ఆశగా కమిట్ మెంట్ తో పనిచేసే నేతలకు మాత్రం చంద్రబాబు చెక్ పెట్టాలనే నిర్ణయించారట. అందుకే ఆర్థికంగా బలంగా ఉన్న నేతల కోసం టీటీడీపీ లో పదవులు ఖాళీగా ఎదురు చూస్తున్నాయి.

