పెద్దదిక్కు లేనట్లేగా
తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒక్కసారిగా ఇటు ఏపీలోనూ, అటు ఢిల్లీలోనూ రాజకీయాలు మారుతున్నాయనే వ్యాఖ్యలు [more]
తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒక్కసారిగా ఇటు ఏపీలోనూ, అటు ఢిల్లీలోనూ రాజకీయాలు మారుతున్నాయనే వ్యాఖ్యలు [more]

తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒక్కసారిగా ఇటు ఏపీలోనూ, అటు ఢిల్లీలోనూ రాజకీయాలు మారుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పరిణామాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీ అధినేత, సీఎం జగన్ వరుసగా ఢిల్లీ ప్రయాణాలు పెట్టుకోవడం, కేంద్రంలో కీలకమైన ప్రధాని మోడీ, హోం మం త్రి అమిత్‌షాలను ఆయన కలుసుకోవడంతో రాజకీయాల్లో మంచి ఊపు వచ్చింది. పైగా ఎన్డీయే పుట్టినప్పటి నుంచి తనకు ఉన్న ప్రాధాన్యం, తాను కేంద్రంలోను, దేశంలోనూ చక్రం తిప్పిన పరిస్థితులు నేడు కలలుగా మారుతుంటే చంద్రబాబుకు బీపీ మరింత పెరుగుతోందని అంటున్నారు.
ఒకప్పుడు అలా…..
ఒకప్పుడు ఎన్డీయే అనగానే కన్వీనర్‌గా చంద్రబాబుకు పెద్ద పేరు ఉండేంది. గతంలో ఎన్డీయే తరపున ప్రధాని అభ్యర్థులను నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అంతెందుకు 2014లోనూ చంద్రబాబు కేంద్రంగా ఎన్నికలు ముందుకు సాగాయి. ప్రధాని మోడీ అప్పటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా అంతా ఇంతా కాదు. అయితే, రోజులు, రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని అన్నట్టుగానే చంద్రబాబు రాజకీయాలు కూడా అలానే మారిపోయాయి.
ఆరాటపడుతున్నా….
2014లో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తర్వాత కాలంలో ఏపీలో మారిన రాజకీయ వ్యూహాల నేపథ్యంలో కేంద్రంతో విభేదించారు. అయితే, ఈ విభేదాలు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు తీసుకోవడం, మోడీ హఠావో నినాదం ఇవ్వడం వంటివి ఆయనకు ఎన్డీయేకు మధ్య అగాధాన్ని పెంచాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా మళ్లీ కలసుకునేలా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ, బీజేపీతో చంద్రబాబు తెంచుకునేలా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నా.. బీజేపీ మాత్రం చంద్రబాబుతో చెలిమి చేసేందుకు సిద్ధంగా లేదు.
పక్కన పెట్టేందుకే?
జగన్‌తో కలిసి ముందుకు నడవాలని అమిత్ షా వంటి వారు లోపాయికారీగా నిర్ణయించారనే వార్తలు వచ్చాయి. దీంతో రేపో మాపో అయినా పొరపొచ్చాలను పక్కన పెట్టి బీజేపీతో సన్నిహితం కావాలని భావించిన చంద్రబాబుకు ఈ పరిణామం శరాఘాతంగా మారింది. వ్యూహకర్తగా, ఢిల్లీలోనే చక్రం తిప్పగలిగే నేతగా పేరున్నప్పటికీ చంద్రబాబును పక్కన పెట్టేందుకు బీజేపీ పెద్దలు నిర్ణయించడంతో చంద్రబాబు ఒకరకంగా పెద్దదిక్కును కోల్పోయారని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిణామాలను తనకు ఎలా అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి.
