బాబుకు ఇప్పుడు ముద్దొస్తుందంట
అధికారంలో ఎవరు ఉంటే వారికి స్థానిక పోలీసులు నచ్చుతారు. వారి విచారణపై నమ్మకం ఉంటుంది. అదే అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తుకు వస్తాయి. [more]
అధికారంలో ఎవరు ఉంటే వారికి స్థానిక పోలీసులు నచ్చుతారు. వారి విచారణపై నమ్మకం ఉంటుంది. అదే అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తుకు వస్తాయి. [more]

అధికారంలో ఎవరు ఉంటే వారికి స్థానిక పోలీసులు నచ్చుతారు. వారి విచారణపై నమ్మకం ఉంటుంది. అదే అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తుకు వస్తాయి. చంద్రబాబు, జగన్ ఎవరు అధికారంలో ఉన్నా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అలాగే వ్యవహరిస్తారు. తాజాగాతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు సీబీఐని గట్టిగా నమ్ముతున్నారు. రాష్ట్ర పోలీసులపై ఆయనకు నమ్మకం లేదని చెబుతున్నారు.
పోలీసులంటే…?
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర పోలీసులను వివిధ కేసుల్లో వెనకేసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ సీబీఐ అంటే చంద్రబాబు మండిపడే వారు. స్థానిక పోలీసులపై వీరికి నమ్మకం లేదా? అని ప్రశ్నించేవారు. ఇక ఎన్నికలకు ముందు మోదీతోనూ, భారతీయ జనతా పార్టీతోనూ స్నేహం చెడిన తర్వాత సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు.
రాష్ట్రంలోకి రానివ్వకుండా…..
ఈ మేరకు చంద్రబాబు సీబీఐ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన పదే పదే ధర్మపోరాట దీక్షల్లో చెప్పేవారు. సీబీఐ, ఈడీ వంటి వాటిపై ఏపీలో నిషేధం విధించడం కూడా అప్పట్లో సంచలనమే అయింది. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో తిరిగి సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెండు కేసుల్లోనూ….
చంద్రబాబు ఇప్పుడు రెండు కేసుల్లో సీబీఐ విచారణ కోరుతున్నారు. ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసుతో పాటు ఆయనపై పెట్టిన కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు గట్టిగా కోరుతున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు లోకల్ పోలీసుల పై నమ్మకం లేదట. తాను అధికారంలో ఉన్నప్పుడు నమ్మని సీబీఐని ఇప్పుడు ఆయన నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు-సీబీఐ హాట్ టాపిక్ గా మారింది.

