ఆ ముగ్గురికీ ఏమైంది?
ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నానా హడావిడి చేసిన నేతల కేకలు ఇప్పుడు పార్టీలో విన్పించడం లేదు. వారు కన్పించడం లేదు. టిక్కెట్ల కేటాయించే సమయంలో మాత్రం [more]
ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నానా హడావిడి చేసిన నేతల కేకలు ఇప్పుడు పార్టీలో విన్పించడం లేదు. వారు కన్పించడం లేదు. టిక్కెట్ల కేటాయించే సమయంలో మాత్రం [more]

ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నానా హడావిడి చేసిన నేతల కేకలు ఇప్పుడు పార్టీలో విన్పించడం లేదు. వారు కన్పించడం లేదు. టిక్కెట్ల కేటాయించే సమయంలో మాత్రం దూకుడు ప్రదర్శించిన నేతలు విపక్షంలోకి వచ్చేసరికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఓటమి వల్ల నిరాశా? లేక ఇక పార్టీలో ఉండటం వేస్ట్ అని నిర్ణయానికి వచ్చారా? అన్నది తెలియకున్నా వారి వైఖరి పట్ల మాత్రం చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు…..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. అంగబలం, అర్థబలం ఈ నేతలు కలిగి ఉండటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరకుండా ఆయన గట్టి ఎత్తుగడే వేశారు. ముగ్గురూ కేంద్ర మాజీ మంత్రులే కావడం విశేషం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలను చేర్చుకున్నారు. వారి రాకతో పార్టీ మరింత బలం పెరుగుతుందని భావించారు. ముఖ్యంగా మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం ఖచ్చితంగా దక్కుతుందని విశ్వసించారు.
మాజీ కేంద్రమంత్రులు కావడంతో…..
అందుకు తగ్గట్టుగానే వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కు అరకు పార్లమెంటు, పనబాక లక్ష్మికి తిరుపతి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు పార్లమెంటు స్థానాలను చంద్రబాబు కేటాయించారు. అయితే జగన్ సునామీ ముందు ముగ్గురూ ఓటమి పాలయ్యారు. సబ్జెక్ట్ పరంగా, సామాజిక పరంగా బలమైన నేతలు కావడంతో చంద్రబాబుకు వీరు కష్టసమయంలో ఉపయోగపడాల్సి ఉంది. చంద్రబాబు సయితం ఇదే ఆశించారు.
పార్టీకి, నియోజకవర్గాలకు దూరంగా….
కానీ ఈ ముగ్గురు మాజీ కేంద్రమంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. కిశోర్ చంద్రదేవ్ అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గం మాత్రమే కాకుండా పార్టీ కార్యాలయం వైపు కూడా తొంగి చూడలేదు. కిశోర్ చంద్రదేశ్ ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక పనబాక లక్ష్మిది కూడా అదే పరిస్థితి. ఆమె హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఒక్క కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం కొంత అడపా దడపా కనపడుతున్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రధాన అంశాల విషయాలపై కూడా వీరు స్పందించకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.

