కేంద్రం వైపే చూస్తున్నారెందుకో?
మన రాష్ఱ్రం… మన పాలన.. ఢిల్లీలో పెత్తనమేంటి? అన్న మాటలు ఎవరో అన్నవి కావు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు. పదే పదే రాష్ట్ర పాలన వ్యవహారాల్లో ఢిల్లీ [more]
మన రాష్ఱ్రం… మన పాలన.. ఢిల్లీలో పెత్తనమేంటి? అన్న మాటలు ఎవరో అన్నవి కావు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు. పదే పదే రాష్ట్ర పాలన వ్యవహారాల్లో ఢిల్లీ [more]

మన రాష్ఱ్రం… మన పాలన.. ఢిల్లీలో పెత్తనమేంటి? అన్న మాటలు ఎవరో అన్నవి కావు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు. పదే పదే రాష్ట్ర పాలన వ్యవహారాల్లో ఢిల్లీ జోక్యాన్ని సహించబోమని చెప్పారు. ఆయన గవర్నర్ వ్యవస్థపై కూడా మండిపడ్డారు. గవర్నర్ లు కేంద్రం తాబేదార్లుగా మారారని, తొలి నుంచి గవర్నర్ల వ్యవస్థను టీడీపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. కానీ ఇవి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటాలు.
అధికారం కోల్పోగానే….
కానీ అధికారం పోగానే కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు అక్కరకు రావాలని కోరుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పదే పదే కోరుతున్నారు. గతంలో రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణానికి కేటాయించిన నిధులు లెక్కలు అడిగితే…అడగటానికి వారెవరు? అని ప్రశ్నించింది కూడా ఈ వాహినీ వారి పెద్దమనిషే. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏంటని పదే పదే ప్రశ్నించేది.
తెలంగాణ ఉద్యమంతో పోల్చి…..
ఇప్పుడు రివర్స్ అయింది. చంద్రబాబుతో సహా ఎల్లో మీడియాకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీ రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో జరిగే ఆందోళనలు తెలంగాణ ఉద్యమాలతో పోల్చే స్థితికి ఎల్లోమీడియా దిగజారింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని, అందరి నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని కూడా తప్పుడు ప్రచారానికి దిగింది. రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం తప్పని సరి అంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది కాబట్టి.
అంత సాహసం చేస్తుందా?
బీజేపీకి ఇప్పుడు మిత్రులు అవసరం. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వరస ఓటములు బీజేపీని మరో రాష్ట్రంవైపు ఆలోచింప చేస్తాయా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అందుకు కమలనాధులు సాహసిస్తారా? అన్న అనుమానం కూడా ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆత్మస్థయిర్యం నిపేందుకే చంద్రబాబుతో సహా ఎల్లో మీడియా ఈ మైండ్ గేమ్ ను ప్రారంభించిందంటున్నారు. మొత్తం మీద ఏపీలో జరిగే రాజకీయ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగానే కన్పిస్తున్నాయన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

