బాబు డమ్మీయేనట
చంద్రబాబు అంటే చండశాసనుడు అంటారు. ఆయన అంటే విపరీతమైన భయం, భక్తి ఉన్నాయని కూడా తమ్ముళ్ళు చెబుతారు. అయితే ఇదంతా అధికారంలో ఉన్నప్పటి ముచ్చట. ఇపుడు బాబు [more]
చంద్రబాబు అంటే చండశాసనుడు అంటారు. ఆయన అంటే విపరీతమైన భయం, భక్తి ఉన్నాయని కూడా తమ్ముళ్ళు చెబుతారు. అయితే ఇదంతా అధికారంలో ఉన్నప్పటి ముచ్చట. ఇపుడు బాబు [more]

చంద్రబాబు అంటే చండశాసనుడు అంటారు. ఆయన అంటే విపరీతమైన భయం, భక్తి ఉన్నాయని కూడా తమ్ముళ్ళు చెబుతారు. అయితే ఇదంతా అధికారంలో ఉన్నప్పటి ముచ్చట. ఇపుడు బాబు హూంకరించినా పార్టీలో ఎవరికీ పట్టడంలేదని చెబుతారు. అయితే టీడీపీ మాజీ తమ్ముడు, మాజీ మంత్రి కూడా అయిన దాడి వీరభద్రరావు మరో అడుగు ముందుకేసి బాబుకు తమ్ముళ్ళు ఎపుడూ భయపడలేదని, నిజానికి బాబే తన కొడుకు లోకేష్ కి భయపడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అసలైన పాలన చేసింది లోకేష్ అంటున్నారు ఈ మాజీ మంత్రి.
చక్రం తిప్పేశారా…?
పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా చక్రం తిప్పింది మాత్రం లోకేష్ అని ఆయన గట్టిగానే చెబుతున్నారు. చంద్రబాబు డమ్మీ సీఎంగా మిగిలిపోయారని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. టీడీపీలో అంతా బాబు ఒక్కరే నాయకుడు అనుకుంటారని, కానీ బాబుని మించిన నాయకుడుగా లోకేష్ మారి చివరికి పార్టీని ముంచేశారని కూడా దాడి అంటున్నారు. మొత్తం అయిదేళ్ళ పాటు తన ఇష్టం వచ్చినట్లుగా పాలన చేసిన చంద్రబాబు వెనక లోకేష్ ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలే చేశారు.
సాంతం ఊడ్చేసారట….
అసలే విభజన గాయలతో కునారిల్లిన ఏపీని అనుభవం ఉందని చంద్రబాబు చేతిలో పెడితే ఆయన ఎటువంటి అనుభవం లేని కొడుకు చేతిలో పెట్టాడని, ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఏపీ అధోగతిపాలు అయిందని దాడి సెటైర్లు వేశారు. అమరావతి రాజధాని పేరు చెప్పి అడుగుకు పన్నెండు వేల రూపాయలు చెల్లించిన చంద్రబాబు అతి తెలివితేటల వెనక లోకేష్ ఉన్నాడని ఆయన కౌంటర్లేశారు. ఇక విజయవాడలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్ళను ప్రభుత్వ ఆఫీసులకు అత్యధిక ధరలకు అద్దెకు ఇప్పించి ఖజానాను లూటి చేయడంలోనూ చంద్రబాబు, లోకేష్ ఘనాపాటీలుగా ఉన్నారని దాడి అంటున్నారు.
పెడబొబ్బలు అందుకేనా…?
అమరావతి రాజధాని నిజానికి లేదన్న సంగతి చంద్రబాబుకు, లోకేష్ కి కూడా తెలుసని, తమ సొంత సామాజికవర్గం ప్రయోజనాలు, దోపిడీ ఆగిపోయినందుకే కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారని కూడా దాడి పదునైన విమర్శలే చేస్తున్నారు. కేంద్రం రాజధాని కోసం ఇచ్చిన నిధులను సైతం సవ్యంగా ఖర్చు చేయకుండా దారి మళ్ళించిన టీడీపీ పెద్దలకు ఇపుడు మూడు రాజధానుల మీద విమర్శలు చేసే హక్కు లేదని ఈ మాజీ మంత్రి తేల్చిపారేశారు. మొత్తానికి చంద్రబాబు గుట్టు లోకేష్ కి ఎరుక అంటూ టీడీపీ ఇన్సైడ్ పాలిటిక్స్ బయటపెట్టిన ఈ మాజీ మంత్రి తమ్ముళ్ళకు అసలైన సందేశం ఇచ్చారా. సందేహాలు మిగిల్చారా అన్నది చూడాలి.

