ఫుల్లుగా ఛార్జి చేసినట్లున్నారే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించింది. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాట ఎలా ఉన్నప్పటికీ ముందుగా పార్టీ నేతలను గాడిలో పెట్టడంలో కొంతమేర [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించింది. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాట ఎలా ఉన్నప్పటికీ ముందుగా పార్టీ నేతలను గాడిలో పెట్టడంలో కొంతమేర [more]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించింది. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాట ఎలా ఉన్నప్పటికీ ముందుగా పార్టీ నేతలను గాడిలో పెట్టడంలో కొంతమేర సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పల్నాడు అంశంతో రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో తన నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుకోగలిగారు. చంద్రబాబు పట్టుకుంటే వదలరని, మరో ఏడాదిలోనే ఆయన పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి రెడీ అవుతున్నారని టీడీపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. చలో ఆత్మకూరు కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఛార్జి అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఇక అమరావతి బాట పట్టక తప్పడంలేదు నేతలకు.
పార్టీకి దూరంగా నేతలు….
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే మోసం చేయడం, మరికొన్ని చోట్ల తాము ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు పట్టించుకోకపోవడం వంటి అంశాలను వారిని నిస్తేజంలోకి నెట్టాయి. అనేకమంది పార్టీ నేతలు ఎన్నికల తర్వాత సొంత వ్యాపారాలపై నిమగ్నమయ్యారు. కొందరు విదేశాలకు వెళ్లి గడిపి వచ్చారు. మరికొందరు నేతలయితే పార్టీ కార్యాలయాలకు వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు.
జిల్లాల పర్యటనల్లో కూడా….
ఈ సమయంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి సీనియర్ నేతలు సీరియస్ గా తీసుకోలేదు. చంద్రబాబు కాకినాడలో రెండు రోజుల పాటు ఉన్నా నేతలు లైట్ గా తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలని చంద్రాబాబు క్యాలండర్ రెడీ చేసుకున్నారు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో నేతల గైర్హాజరయ్యారు. అలాగే పార్టీ నుంచి నేతలు జారిపోతున్నారు. కేసుల భయంతోనూ, వ్యాపారాలతోనూ నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
పల్నాడు ప్లాన్ తో…..
దీంతో పాటుగా చంద్రబాబు తర్వాత పార్టీని నడిపేదెవరు? అన్న ప్రశ్న కూడా నేతలను వేదిస్తోంది. వీటన్నింటినీ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు పల్నాడ్ ప్లాన్ చేశారు. పూర్తిగా వర్క్ అవుట్ అయింది. పదమూడు జిల్లాల నుంచి నేతలు చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ పలకరించడం ఇందుకు అద్దం పడుతోంది. పదమూడు జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించాలని చంద్రబాబు పార్టీ కేంద్రకార్యాలయాన్ని ఆదేశించారు. పదమూడు జిల్లాల్లో ఎక్కడ వైసీపీ బాధితులు ఉన్నప్పటికీ పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలు పంపాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద పల్నాడు ప్లాన్ వైసీపీకి ఎంతవరకూ నష్టం చేసిందో తెలియదు కాని టీడీపీకి మాత్రం మేలు చేసిందనే చెప్పాలి.

