డిఫరెంట్ యాంగిల్ లేదా?
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పాడిందే పాట పాడుతున్నారనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పుడు పార్టీలో పెను మార్పులు [more]
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పాడిందే పాట పాడుతున్నారనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పుడు పార్టీలో పెను మార్పులు [more]

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పాడిందే పాట పాడుతున్నారనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పుడు పార్టీలో పెను మార్పులు కోరుతున్నారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఈ ఏడాది ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి కార్యకర్తలు, నాయకులను ఒడ్డుకు చేర్చాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటనను ప్రారంభించారు. నాయకులను కార్య కర్తలను కూడా ఒకే వేదికపైకి చేర్చి వారిలో భరోసా నింపాలని నిర్ణయించి ఈ దిశగా కార్యక్రమాలు చంద్రబాబు ప్రారంభించారు. దీంతో బాబు ప్రయత్నాలు, వ్యూహాలు స్పెషల్గా ఉంటాయని అందరూ ఆశించారు.
అవే ప్రసంగాలతో….
ఇంకేముంది.. చంద్రబాబు తమకు కొండంత మనోధైర్యం కల్పిస్తారని అనుకున్నారు. దీంతో ఎక్కడక్కడ నుంచో కార్యకర్తలు, నాయకులు తమ పనులు మానుకుని మరీ చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు హాజరవుతున్నారు.అయితే, చంద్రబాబులో డిఫరెంట్ యాంగిల్ చూడాలని భావించిన నాయకులకు నిరాశే ఎదురవుతోంది. ఆయన ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రసంగాలు చేశారో. ఇప్పుడు కూడా అవే ప్రసంగాలను రిపీట్ చేస్తుండడంతో వారు విస్తు పోతున్నారు.
పొగడ్తలు…విమర్శలు…..
ప్రస్తుతం సమీక్షలు చేస్తున్న చంద్రబాబు.. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా చేయాల్సిన ప్రసంగాలు ఫక్తు పొలిటికల్ గా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలను తలపిస్తున్నాయి. తన అనుభవాన్ని రంగరించి వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీని ఎలాముందుకు నడిపించాలనే విషయాలను చెప్పాల్సిన చంద్రబాబు అధికార పార్టీ నేతలపై విమర్శలు, తన పాలనపై పొగడ్తలతోనే చాపచుట్టేస్తున్నారు. అదేస మయంలో ఎవరికీ కీలక బాధ్యతలు అప్పగించడం లేదు. పార్టీ మారిన, మారాలని ప్రయత్నిస్తున్న వారిని కాపాడుకునేందుకు, అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
సరిదిద్దుకుంటారా?
యువతకు ప్రాధాన్యం అన్నారే తప్ప వారికి ఎలాంటి పదవులు ఇస్తారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రాజ్యమేలుతోంది. మొత్తంగా పరిస్థితి మారుతుందని అనుకున్నా..చంద్రబాబు వ్యూహం మాత్రం ఆశించిన విధంగా లేదని అంటున్నారు. మరి చంద్రబాబు ఇవన్నీ తెలుసుకుని సరిదిద్దు కుంటారో ? ఇలాగే కంటిన్యూ అవుతారో ? చూడాలి.
