కంట్రోల్ చేయాలంటే మిషన్ తప్పదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పార్టీని కంట్రోలో చేయడం భవిష్యత్తులో కష్టంగానే కన్పిస్తుంది. ప్రజామోదం లేకపోవడం, అధికార పార్టీ దూకుడు మీద ఉండటంతో క్యాడర్ ఇప్పటికే చెల్లాచెదురుగా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పార్టీని కంట్రోలో చేయడం భవిష్యత్తులో కష్టంగానే కన్పిస్తుంది. ప్రజామోదం లేకపోవడం, అధికార పార్టీ దూకుడు మీద ఉండటంతో క్యాడర్ ఇప్పటికే చెల్లాచెదురుగా [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పార్టీని కంట్రోలో చేయడం భవిష్యత్తులో కష్టంగానే కన్పిస్తుంది. ప్రజామోదం లేకపోవడం, అధికార పార్టీ దూకుడు మీద ఉండటంతో క్యాడర్ ఇప్పటికే చెల్లాచెదురుగా మారింది. మరోవైపు టీడీపీ నేతలు సయితం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలను కూడా బతిమాలో, భయపెట్టో వైసీపీ ఎగరేసుకుపోతుందన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కన్పిస్తుంది. అయితే వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు.
ఐదు నెలల్లోనే….
అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే అనేక మంది టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. కొందరు బలమైన నేతలు బీజేపీలోకి వెళ్లగా మరికొందరు వైసీీపీలోకి జంప్ చేస్తున్నారు. గెలిచిన 23 మందిలో ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సయితం రాష్ట్రంలో టీడీపీనే టార్గెట్ చేసుకుంది. డిసెంబరు 15వ తేదీలోపు మరింత మంది టీడీపీ నేతలు తమ పార్టీలో చేరతారని కమలనాధులు చెబుతుండటం చంద్రబాబును ఆలోచనలోకి నెట్టేసింది.
బీజేపీతో కలసి నడవడమే….
అందుకోసమే వలసలకు అడ్డుకట్ట వేయాలంటే చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం బీజేపీతో కలసి నడవడమే. బీజేపీ పట్ల ఇప్పటికే సాఫ్ట్ కార్నర్ గా ఉన్న చంద్రబాబు ఆ పార్టీ నేతలు ఎవ్వరితో భేటీ కాలేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ తో నాగ్ పూర్ లో భేటీ అయ్యారన్న వార్తలు మాత్రం వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు చంద్రబాబును కలిసేందుకు ఇష్టపూర్వకంగా లేరు. ప్రస్తుతం వాళ్లంతా జార్ఖండ్ ఎన్నికలు, మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటు నుంచి నరుక్కురావాలని చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యనేతతో సంప్రదింపులు…..
ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ వస్తుంటారు. తొలుత తెలంగాణలో టీడీపీని బీజేపీతో జత చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిస్తే కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే తెలంగాణలో ముఖ్య బీజేపీ నేతతో చంద్రబాబు ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. తొలుత తెలంగాణాలో బీజేపీతో జతకట్టి తర్వాత ఏపీకి దానిని కంటిన్యూ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. వీలయినంత త్వరలో ఈ మిషన్ ను కంప్లీట్ చేయాలని టీడీపీ సీనియర్ నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది.

