సైజ్ బాగా తగ్గించారట
చంద్రబాబుని బాబోరు అని ముద్దుగా అంటారు తమ్ముళ్ళు. బాబోరూ అంటేనే ఇక్కడ ఒక సెటైర్ కూడా సౌండ్ చేస్తుంది. తన సుదీర్ఘ ఉపన్యాసాలతో బాబు గారు బోరు [more]
చంద్రబాబుని బాబోరు అని ముద్దుగా అంటారు తమ్ముళ్ళు. బాబోరూ అంటేనే ఇక్కడ ఒక సెటైర్ కూడా సౌండ్ చేస్తుంది. తన సుదీర్ఘ ఉపన్యాసాలతో బాబు గారు బోరు [more]

చంద్రబాబుని బాబోరు అని ముద్దుగా అంటారు తమ్ముళ్ళు. బాబోరూ అంటేనే ఇక్కడ ఒక సెటైర్ కూడా సౌండ్ చేస్తుంది. తన సుదీర్ఘ ఉపన్యాసాలతో బాబు గారు బోరు కొట్టిస్తారని సొంత పార్టీలో పంచులు అలా గట్టిగానే పడుతూంటాయి. అందుకే బాబు గారు వేదిక మీద మాట్లాడుతూ ఉంటే నాయకులంతా నిద్రలోకి వెళ్ళిపోవడం ఎన్నో సార్లు పేపర్లలో ఫోటోలుగా వచ్చిన సంగతులు తెలిసిందే. ఇక చంద్రబాబుకు అది పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా ఒక్కటే. అదే విధంగా అధికారుల మీటింగ్ అయినా మీడియా సమావేశం అయినా కూడా చంద్రబాబు గారి ప్రసంగం ధారాపాతంగా అలా సాగిపోతూనే ఉంటుంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు ఇదొక పెద్ద మైనస్ గా పార్టీ వారే చెబుతారు. దాంతో జనాలకు చేరాల్సిన సందేశం చేరకుండాపోతోందన్న ఆవేదన కూడా పార్టీలో ఉంది. అయితే ఓడిపొయాక నేను మారాను అంటున్న చంద్రబాబులో ఇపుడు కొత్త మార్పుని పార్టీ జనాలు చూస్తున్నారుట.
గోదారి జిల్లాల నుంచే…
పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాలో చంద్రబాబులో మార్పును తమ్ముళ్ళు స్పష్టంగా గమనించారట. తాను చెప్పదలచున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చంద్రబాబు మాట్లాడడమే కాదు, పది నిముషాల్లో ముగించడంతో తమ్ముళ్ళ ఆనందానికి అవధులు లేవని అంటున్నారు. చంద్రబాబు ఇదే తీరున ఇకపై సమావేశాల్లో తక్కువ మాట్లాడి క్యాడర్ కి ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుందని కూడా అంటున్నారు. దీని వల్ల చంద్రబాబుకు పార్టీలో ఏం జరుగుతుందన్నది తెలుస్తుందని, చంద్రబాబు ఏం చెప్పారు, ఏం అనుకుంటున్నారన్నది కూడా తమ్ముళ్ళకు అర్ధమవుతుందని అంటున్నారు. ఇది సరే కానీ, చంద్రబాబు ఈ రకంగా చేయడం వెనక కారణాలు ఏంటి అన్నది కూడా ఇపుడు పార్టీలో చర్చగా ఉంది. చంద్రబాబు మారాను అంటే ఏదో అనుకున్నారు కానీ నిజంగా బాబు ఇపుడు గట్టి ప్రయత్నమే చేస్తున్నారని తమ్ముళ్ళు ఆనందపడుతున్నారు.
మారిన కాలానికి…..
నిజానికి ఇపుడు కాలం చాలా మరిపోయింది. ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద మీటింగులు అంటే బోరు అంటున్నారు. ఇక చంద్రబాబు సభలో మాట్లాడుతూంటే జనం లేచి వెళ్ళిపోవడం ఎన్నో సార్లు మీడియాలోనే కనిపించింది. దానికి కారణం ఆధునిక పోకడల ప్రపంచంగానే చెబుతున్నారు. పైగా స్మార్టు ఫోన్ల కాలంలో అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరూ కొత్తగా తెల్సుకోవాల్సింది లేదు. అందువల్ల చెప్పదలచుకున్నది సూటిగానే చెప్తేనే అది జనాల్లోకి వెళ్తుందన్న విషయం ఆలస్యంగానైనా చంద్రబాబు గ్రహించారని అంటున్నారు.
జగనే కారణమా?
దానికి జగన్ కూడా మరో రకంగా కారణం అంటున్నారు. జగన్ క్లుప్తంగానే మాట్లాడుతారు ఎపుడు. ఆయన తన సభకు ఎన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా వారిని చూసి మైమరచిపోరు. తాను చెప్పదలచుకున్నది చెప్పేసి ముగించేస్తారు. అదే చంద్రబాబు అయితే జనాన్ని చూస్తే పూనకం తెచ్చుకుంటారని అంటారు. జగన్ విజయం వెనక షార్ట్ కట్ ప్రసంగాలు అని కూడా టీడీపీ వ్యూహకర్తలు చంద్రబాబుకు చెప్పారో ఏమో కానీ బాబు ఇపుడు మాటల జోరు, బోరు తగ్గించి మాట్లాడుతున్నారట. ఇదే రకంగా చంద్రబాబు ఉండగలిగితే మా మంచి బాబోరు అంటామని తమ్ముళ్ళే చెబుతున్నారు. చూడాలి మరి.

