అందరూ సరెండర్ అయిపోతున్నారుగా…?
మొన్నటి వరకూ చంద్రబాబు నచ్చని పదం ఏకగ్రీవం. ఇప్పుడు ఎన్నికలయిపోయాక పదం మారింది. సరెండర్. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీకి సరెండర్ అయిపోయేందుకు సిద్ధమయిపోవడమే చంద్రబాబు [more]
మొన్నటి వరకూ చంద్రబాబు నచ్చని పదం ఏకగ్రీవం. ఇప్పుడు ఎన్నికలయిపోయాక పదం మారింది. సరెండర్. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీకి సరెండర్ అయిపోయేందుకు సిద్ధమయిపోవడమే చంద్రబాబు [more]
మొన్నటి వరకూ చంద్రబాబు నచ్చని పదం ఏకగ్రీవం. ఇప్పుడు ఎన్నికలయిపోయాక పదం మారింది. సరెండర్. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీకి సరెండర్ అయిపోయేందుకు సిద్ధమయిపోవడమే చంద్రబాబు కలవరానికి కారణం. రెండేళ్లయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్లామర్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జగన్ క్లీన్ స్వీప్ చేసేశారు. నిజింగా చెప్పాలంటే ఇది జగన్ విజయమే.
జగన్ దండయాత్రతో….
అభ్యర్థులు ఎవరైనా, మంత్రులు ఎంతమంది ప్రచారం చేసినా వైసీపీకి విజయం దక్కిందంటే దానికి జగన్ ఫొటోయే కారణమని చెప్పక తప్పదు. తాను కదలకుండా ప్రచారానికి వెళ్లకుండా ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకూ టీడీపీపై జగన్ దండయాత్ర చేసేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు అయిన సమయంలో టీడీపీ నేతల నుంచి వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే.
స్పందన కూడా కరువయిందే?
ఒకరిద్దరూ మాజీ మంత్రులు స్పందించారు తప్పించి ఎవరూ దీనిని పెద్దగా పట్టించకోలేదు. దీంతో పాటు టీడీపీ గెలిచిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి. ఇక్కడ జేసీ బ్రదర్స్ వ్యక్తిగత విజయమేనని చెప్పాలి. జేసీ బ్రదర్స్ కూడా ఇదే చెప్పారు. తమ వల్లనే తాడిపత్రి గెలుచుకున్నామని, ఇక్కడ టీడీపీ విజయం కాదని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
వైసీపీ టచ్ లోకి…..
తాను అవసరమైతే జగన్ ను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేత చెప్పడం పార్టీ నేతలను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు సైలెంట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నేతల్లో మరింత కలవరం మొదలయిందంటున్నారు. కొందరు ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. సరెండర్ అవ్వడమే శరణ్యమని ఎక్కువ మంది భావిస్తుండటం చంద్రబాబులో కలవరానికి ప్రధాన కారణం అని చెప్పాలి.