రెచ్చగొట్టడం.. రచ్చకు దిగడం.. అందుకేనా?
రాష్ట్ర రాజకీయాల్లో భాష బొత్తిగా మారిపోయింది. డెబ్బైలలో రాజకీయ ప్రవేశం చేసిన చంద్రబాబు సైతం తన స్థాయిని తగిన భాషను ఈ మధ్యన అసలు వాడడంలేదు. ఇక [more]
రాష్ట్ర రాజకీయాల్లో భాష బొత్తిగా మారిపోయింది. డెబ్బైలలో రాజకీయ ప్రవేశం చేసిన చంద్రబాబు సైతం తన స్థాయిని తగిన భాషను ఈ మధ్యన అసలు వాడడంలేదు. ఇక [more]

రాష్ట్ర రాజకీయాల్లో భాష బొత్తిగా మారిపోయింది. డెబ్బైలలో రాజకీయ ప్రవేశం చేసిన చంద్రబాబు సైతం తన స్థాయిని తగిన భాషను ఈ మధ్యన అసలు వాడడంలేదు. ఇక మిగిలిన వారిని గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత బాగుంటుంది. ఈ మధ్య చంద్రబాబు వైసీపీ సర్కార్ ని ఉద్దేశించి ఏం పీకారు అని తరచుగా నిలదీస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మొదలుపెట్టిన ఈ భాషా కౌశలం కాస్తా ఇపుడు ఆయన నోట బహు సుందరంగా పలుకుతోంది. ఎక్కడ పడితే అక్కడ ఆయన ఇదే మాట వాడుతూ అవే పంచ్ డైలాగులని కూడా అనుకుంటున్నారు.
అదే రిటార్ట్ ….
ఇక వైసీపీ నేతలు ఊరుకుంటారా. చంద్రబాబు భాషలోనే వారూ సమాధానం చేబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే తొందరపడకు బాబూ అన్నీ పీకుతామని గట్టిగానే జవాబు ఇస్తున్నారు. అయిదేళ్ల పాలనలో అక్రమంగా దోచుకున్న అయిదు లక్షల కోట్లను కూడా పీకుతామని కూడా హెచ్చరిస్తున్నారు. ఆ అవినీతి సొమ్ము అంతా విదేశాల్లో ఉందని, దాన్ని చంద్రబాబు చేతనే కక్కిస్తామని కూడా చెబుతున్నారు. అంతే కాదు ఏం పీకారు అంటున్న బాబు కాస్తా రెండేళ్ళు వెనక్కి వెళ్తే జనాలు ఏం పీకి పారేశారో కూడా అర్ధమవుతుంది అని సెటైర్లు వేస్తున్నారు.
అదేనా అలుసు ….
నిజానికి చంద్రబాబు అవినీతి అంటూ అయిదేళ్ల పాటు జనాలో ఊదరగొట్టిన జగన్ తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా కూడా ఒక్కటీ నిరూపించలేకపోయారు. దాంతోనే చంద్రబాబు ఇపుడు పెద్ద గొంతుక చేస్తున్నారు. ఏం పీకలేకపోయారు అని ఎకసెక్కం చేస్తున్నారు. నిజానికి రాజకీయ నాయకుల అవినీతి అన్నది ఒక బ్రహ్మ పధార్ధం. దాన్ని విచారించలేక పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలే చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. మరో వైపు రాజకీయ గండర గండడు చంద్రబాబు అయితే తన గుట్టు మట్లు ప్రత్యర్ధులకు దొరికేటంత నిర్లక్షంగా ఉంటారా అన్న చర్చ కూడా ఉంది. అందుకే ఆయన జనాల్లోకే వచ్చి మరీ చాలెంజ్ చేస్తున్నారు.
ఉక్రోషమేనా….?
చంద్రబాబు ఏం అడుగుతున్నారో వైసీపీ పెద్దలకు తెలుసు. తమను ఎలా వెటకారం చేస్తున్నారో ఇంకా బాగా తెలుసు. అందుకే వారికి పట్టలేని ఉక్రోషం వస్తోంది. చంద్రబాబు మాటలతో ఒళ్ళు బాగా మండిపోతోంది. కానీ ఏం చేయలేకపోతున్నారా అన్నదే చర్చ. కేవలం మాటలు చెబుతూ కాలం వెళ్లదీయడమేనా అన్న సందేహాలు సొంత పార్టీలో కూడా వినవస్తున్నాయి. నిజానికి చంద్రబాబు అవినీతి అది మచ్చుకైనా ఒక్కటి కూడా నిరూపించలేకపోవడం వైసీపీ అసమర్ధతగానే అంతా చూస్తున్నారు. అందుకే చంద్రబాబు రెచ్చగొట్టుడు తీరుని ప్రదర్శిస్తున్నారు. ఏం పీకారు అంటూ బాబు అంటూంటే రేపూ మాపూ మీ సంగతి తేలుస్తామని వైసీపీ చెప్పడం సర్వసాధారణం అయిపోయింది. మొత్తానికి ఈ పీకుడూ లాగుడూ వ్యవహారాన్ని జనం కూడా సీరియస్ గా పట్టించుకోవడం మానేశారు అని చెప్పాలి.

