స్ట్రయిట్ గా వెళితే కుదరదట.. ఆ మార్గం దొరికిందట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు నియోజకవర్గాల్లో నాయకత్వం కూడా సమస్య గా మారింది. అందుకే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు నియోజకవర్గాల్లో నాయకత్వం కూడా సమస్య గా మారింది. అందుకే [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు నియోజకవర్గాల్లో నాయకత్వం కూడా సమస్య గా మారింది. అందుకే సానుభూతి కోసమే చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. తనపై సానుభూతి ఎంతగా ప్రజల్లో వస్తే అంతగా పార్టీకి అనుకూలంగా మారుతుందన్నది చంద్రబాబు విశ్వాసం. అందుకే ఇటీవల తిరుపతి ఎయిర్ పోర్టులో దాదాపు 9 గంటల పాటు నిరసనదీక్ష చేశారు. ఒకరకంగా చంద్రబాబు చేసిన ఈ దీక్షతో కొంతవరకూ సానుభూతి వచ్చిందనే చెప్పాలి.
భవిష్యత్ లోనూ ఇదే తరహాలో….
భవిష్యత్ లోనూ ఇదే తరహాలో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి జగన్ ను ఎంత విమర్శించినా పార్టీకి రాని హైప్ కేవలం 9 గంటల్లో చంద్రబాబు జాతీయ స్థాయిలో తీసుకురాగలిగారు. ఆరోజు జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు తిరుపతి దీక్షను హైలెట్ చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా రాని ప్రచారం కేవలం తొమ్మిది గంటల్లో చంద్రబాబు దక్కించుకున్నారు.
సానుభూతి బాగా రావడంతో…
అయ్యో పాపం అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడ్డాయంటే ఏ మేరకు సానుభూతి వచ్చిందో చంద్రబాబుకు అర్థమయింది. దీంతో రానున్న కాలంలో ఇలాంటివే ఎక్కువ చేయాలని పార్టీ సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేయనున్నారు. దీనికి సహజంగానే ప్రభుత్వం అడ్డుకుంటుంది.
తర్వాత ఉత్తరాంధ్రలో…..
దానిని తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రోగ్రామ్ ఛార్ట్ కూడా తయారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సమావేశాలు, బహిరంగ సభలకు, దీక్షలకు రాని ప్రచారం తనను నిర్భందించడంపై రావడంతో త్వరలో చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే తరహా నిరసనలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ను కెలికి మరీ తనను నిర్భంధించుకునేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారంటున్నారు. సానుభూతి చంద్రబాబు ఆశించినట్లు వస్తుందా? లేదా రివర్స్ అవుతుందా? అన్నది వేచిచూడాలి.

