అసలు చోట విషయం లేకుంటే ..వేలెత్తి చూపడం ఎలా?
పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత జిల్లా ప్రతిసారి షాకిస్తుంది. సొంత జిల్లాలోనే చంద్రబాబుకు పట్టు లేకపోవడం రాజకీయంగా ఇబ్బంది అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ [more]
పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత జిల్లా ప్రతిసారి షాకిస్తుంది. సొంత జిల్లాలోనే చంద్రబాబుకు పట్టు లేకపోవడం రాజకీయంగా ఇబ్బంది అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ [more]

పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత జిల్లా ప్రతిసారి షాకిస్తుంది. సొంత జిల్లాలోనే చంద్రబాబుకు పట్టు లేకపోవడం రాజకీయంగా ఇబ్బంది అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లు ముఖ్యమంత్రులుగా లేకపోయినా తమ సొంత జిల్లా కడపపై ఆధిపత్యం ఉండేది. అత్యధిక స్థానాలను అక్కడ గెలిచి తమకు పట్టుందని వారు ప్రతి ఎన్నికల్లో నిరూపించేవారు. కానీ చంద్రబాబు మాత్రం సొంత జిల్లాలో ప్రతి ఎన్నికల్లో ఇబ్బంది పడుతున్నారు.
మొన్నటి ఎన్నికల్లోనూ….
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చిత్తూరు జిల్లా చంద్రబాబు కోలుకోలేని దెబ్బతీసింది. హేమాహేమీ నేతలున్నప్పటికీ చిత్తూరు జిల్లా వాసులు ఎవరినీ ఆదరించలేదు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పోటీ చేసన కుప్పం నియోజకవర్గం తప్ప టీడీపీ ఎక్కడా విజయం సాధించలేదు. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాల్లో కూడా టీడీపీ ఓటమి చెందింది. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలో కూడా గెలుస్తామన్న నమ్మకం లేదు.
పంచాయతీ ఎన్నికల్లోనూ….
తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చిత్తూరు జిల్లాలోనే జరిగాయి. 110 పంచాయతీలు ఏకగ్రీవమయితే అందులో 96 పంచాయతీలు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. చిత్తూరు జిల్లా నేతలతో పదే పదే చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నా అభ్యర్థులను పోటీకి దింపలేకపోయారంటే పార్టీ పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు.
వేలెత్తి చూపాలంటే….?
గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజారిటీ గణనీయంగా తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం పరిధిలో వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. సొంత జిల్లాలోనే చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందులు పడుతుండటం చర్చనీయాంశమైంది. ఆయన ఇతర జిల్లాల నేతలను కట్టడి చేయాలంటే తొలుత సొంత జిల్లాను చక్కదిద్దుకుంటేనే సాధ్యపడుతుంది. అప్పటి వరకూ చంద్రబాబు ఎంత చెప్పినా మిగిలిన జిల్లాల నేతలు లైట్ తీసుకుంటారన్నది మాత్రం వాస్తవం.

