బాబు వారిని నమ్మట్లేదు.. అందుకే ఆయనకు ప్రయారిటీ
చంద్రబాబు ఎవరినీ నమ్మరు. టీడీపీ లోపలా బయటా వినిపించే మాట ఇది. రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారంతా కూడా ఇందులో కొంత నిజం ఉందనుకుంటారు. మరి [more]
చంద్రబాబు ఎవరినీ నమ్మరు. టీడీపీ లోపలా బయటా వినిపించే మాట ఇది. రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారంతా కూడా ఇందులో కొంత నిజం ఉందనుకుంటారు. మరి [more]

చంద్రబాబు ఎవరినీ నమ్మరు. టీడీపీ లోపలా బయటా వినిపించే మాట ఇది. రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారంతా కూడా ఇందులో కొంత నిజం ఉందనుకుంటారు. మరి చంద్రబాబు ఎవరిని నమ్ముతారు అంటే తాత్కాలికంగానైనా బాబు కొంతమందిని నమ్మకతప్పదు, వారిపైనే చంద్రబాబు ఆధారపడతారు కూడా. ఇపుడు ఉత్తరాంధాలో చూసుకుంటే చంద్రబాబు ఎక్కువగా అచ్చెన్నాయుడు మీదనే నమ్మకం ఉంచారని అంటున్నారు. అచ్చెన్న మీద చంద్రబాబు కు ఈ నమ్మకం ఉండడానికి కారణం దివంగత నేత ఎర్రన్నాయుడు. ఆయన బాబుకు వీర విధేయుడుగా మెలిగారు. ఇక ఆ కుటుంబానికి జిల్లాలో ఓటమి లేదు. ప్రతీసారీ గెలుస్తూ వస్తున్నారు. ఇవన్నీ కలిసి అచ్చెన్న అంటే చంద్రబాబు ఇష్టపడుతున్నారు.
అధిక విలువ ….
అచ్చెన్నకు అటు పార్టీలోనూ, ఇటు శాసనసభా పక్షంలోనూ చంద్రబాబు విలువ ఇస్తున్నారు. ఆయన్ని ఉప నాయకుడిని చేసి శాసనసభలో జగన్ మీద బాణంగా వదులుతున్నారు. మరో వైపు పార్టీలో కూడా ఆయన్నే ముందుంచి కధ నడిపిస్తున్నారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటన జరిగితే చంద్రబాబు వేసిన విచారణ కమిటీకి అచ్చెన్నను లీడర్ని చేశారు. ఆయన కంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నా కూడా చంద్రబాబు అచ్చెన్ననే ముందుకు తెస్తున్నారు. ఓ విధంగా ఆయన పెద్ద నోరును కూడా చంద్రబాబు ఈ కీలక సమయంలో ఉపయోగించుకుంటున్నారనుకోవాలి.
వారు అంతేనా ..?
ఇక విశాఖలో దుర్ఘటన జరిగింది. జిల్లాలో ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులు ఉన్నారు. వారిని కనీసం ఈ కమిటీలో తీసుకోలేదు. ఇక అయ్యన్నపాత్రుడు కాస్త అయినా నోరు విప్పారు, బాధితులకు న్యాయం చేయమని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకైనా వచ్చారు. కానీ గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆయన అసలు ఎమ్మెల్యేగా ఉన్నారా. ఇక టీడీపీలో ఉన్నారా…చంద్రబాబు కు ఒకపుడు కుడిభుజంగా వ్యవహరించిన గంటా ఈ కీలక సమయంలో ఏమైపోయారోనని కూడా చర్చకు వస్తోంది. చంద్రబాబు సైతం ఆయన్ని పట్టించుకుంటున్నారా అన్న డౌట్లు టీడీపీలోనే వస్తున్నాయి.
కళా విహీనమే….
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఉన్నారు. చంద్రబాబు జగన్ మీద యుధ్ధం అంటూ ప్రకటించిన గ్యాస్ లీకేజి దర్యాప్తు కమిటీలో తన తరువాత పార్టీలో పెద్దగా ఉన్న కళాను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడమూ విడ్డూరమే. కళాను ఎందుకో చాలా కాలంగా చంద్రబాబు పక్కన పెడుతున్నారని టీడీపీలో వినిపిస్తోంది. ఇపుడు మరో మారు అదే నిజం అని తేలుతోంది. ఇక అచ్చెన్నకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఆయన్ని రేపటి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు కు ఉత్తరాంధ్రాల్లో భారీ నేతే కావాల్సివచ్చాడని అంటున్నారు. నోరు పెద్దది, దాంతో పాటు ఆజానుబాహుడు అయిన అచ్చెన్న అయితేనే జగన్ తో ఢీ కొట్టగలరని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. అదే టైంలో చాలా మంది మాజీల మీద చంద్రబాబు కు పెద్దగా నమ్మకం కుదరడంలేదని కూడా అంటున్నారు.

