చాదస్తమా? చపలత్వామా? ఎందుకింత ఫ్రస్టేషన్?
సహజంగా 70 ఏళ్లు దాటితే చాదస్తం వస్తుందంటారు పెద్దలు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబులో కూడా చాదస్తపు ఛాయలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు [more]
సహజంగా 70 ఏళ్లు దాటితే చాదస్తం వస్తుందంటారు పెద్దలు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబులో కూడా చాదస్తపు ఛాయలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు [more]

సహజంగా 70 ఏళ్లు దాటితే చాదస్తం వస్తుందంటారు పెద్దలు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబులో కూడా చాదస్తపు ఛాయలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన వన్నీ మర్చిపోయి ఇప్పుడు అదే అంశాలను ప్రస్తావించడం చాదస్తపు మాటలు కాక ఇక ఏంటి? తాను అధికారంలో ఉన్నప్పుడు అంతా తనదేనంటారు. చీఫ్ సెక్రటరీ ఎవరు అని ప్రశ్నిస్తారు? ఎన్నికల కమిషనర్ కు ఏం అధికారాలున్నాయంటూ నిలదీస్తారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు…..
గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదకరమంటారు. సీబీఐ తన గుమ్మం తొక్కడానికి వీల్లేదంటారు. ప్రతిపక్షం ఎవరని ప్రశ్నిస్తారు. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం చంద్రబాబుకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. తమ నేతలందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. కానీ టీడీపీ అధికారంలో ఉండగా ఎన్ని యాత్రలకు అనుమతి ఇచ్చారు? ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? అన్న ప్రశ్నలు చంద్రబాబుకే ఎదురు తంతున్నాయి.
మతపరమైన వ్యాఖ్యలతో…
చంద్రబాబు ఇక పూర్తిగా లౌకిక వాదాన్ని వదిలేసినట్లే కనపడుతుంది. క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ జగన్ ను పదే పదే వ్యాఖ్యానించడం వెనక కూడా ఇదే ఉంది. గత ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం మినహా ఏ రిజర్వడ్ నియోజవర్గంలో టీడీపీ గెలవలేదు. ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకు దక్కవనే చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే బీజేపీకి మించి క్రైస్తవులపై విమర్శలు చేస్తున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలో చంద్రబాబు ముందుండి విమర్శలు చేస్తున్నారు.
అందుకేనా ఆ ఫ్రస్టేషన్….?
చంద్రబాబులో స్పష్టంగా ఫ్రస్టేషన్ కన్పిస్తుంది. తాను చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానమివ్వక పోవడం, వరసగా తమ నేతలను వివిధ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుండటంతో ఆయన అదుపు తప్పుతున్నారని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించింది మావాళ్లే ఏం చేసుకుంటారో చేసుకోండని ప్రశ్నించడం ఆయన పడుతున్న బాధకు అద్దం పడుతుంది. మొత్తం మీద చాదస్తం, బాధ కలసి ఇప్పుడు చంద్రబాబుగా మారాయనే చెప్పాలి.

