అన్నీ మూసుకుని ఎందుకు కూర్చున్నారో?
ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉంది. దానికి కూడా ఒక పుట్టిన రోజు ఉంటుంది. ఉండాలి అని గత అయిదేళ్ళ ఏలిక అయిన తెలుగుదేశానికి అసలు తెలియలేదు, ఎంతో [more]
ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉంది. దానికి కూడా ఒక పుట్టిన రోజు ఉంటుంది. ఉండాలి అని గత అయిదేళ్ళ ఏలిక అయిన తెలుగుదేశానికి అసలు తెలియలేదు, ఎంతో [more]

ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉంది. దానికి కూడా ఒక పుట్టిన రోజు ఉంటుంది. ఉండాలి అని గత అయిదేళ్ళ ఏలిక అయిన తెలుగుదేశానికి అసలు తెలియలేదు, ఎంతో అనుభవం ఉన్న నాయకుని సారధ్యంలోని సర్కార్ చేసిన పని అది. తెలంగాణాను ఉమ్మడి ఏపీ నుంచి విడగొట్టిన జూన్ 2వ తేదీన రోదనలు, ఆవేదనలతో చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు అంటూ వారం రోజుల పాటు కార్యక్రమాలు జరిపించేవారు. ఎవరు చెప్పారో ఏమో కానీ అది ఒక కార్యక్రమమేనా అని జనాలు విడ్డూరపడేవారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 అక్టోబర్ 1 కానీ, ఉమ్మడి ఏపీ ఏర్పడిన నవంబర్ 1 కానీ ఏపీకి ఒక అవతరణ రోజుగా చేయాలని భాషాభిమానులు.మేధావులు చేసిన విన్నపాలను నాటి సర్కార్ అసలు పట్టించుకోలేదు.
జగన్ హామీతో….?
ఇక పాదయాత్రలో ఇదే విషయం చర్చకు వస్తే తాను అధికారంలోకి వస్తే అలాగే చేసి తీరుతాను అని నాటి విపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం జగన్ అధికారం చేపట్టాక ఈ ఏడాది నుంచి అవతరణ దినోత్సవాలను నవంబర్ 1 నాడు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం ఏపీ సర్కార్ ఘనంగానే ఈ ఉత్సవాలను నిర్వహించింది. ఎక్కడికక్కడ జిల్లాలలో ఇంచార్జి మంత్రులు కూడా వేడుకలను జరిపారు. అధికారుల స్థాయిలో కూడా అవతరణ పండుగ జరిగింది. అంతా బాగానే ఉంది కానీ ఈ ఉత్సవాలలో ఎక్కడా ప్రతిపక్షం పాలు పంచుకోకపోవడమే విశేషం.
మరీ ఇలానా …?
జగన్ సర్కార్ చెప్పింది కాబట్టి తాము చేయకూడదు అన్నది విపక్ష తెలుగుదేశం విధానంగా కనిపిస్తోంది అంటున్నారు. ఎక్కడా అవతరణ ఉత్సవాలు పార్టీ హోదాలో టీడీపీ నిర్వహించలేదని చెబుతున్నారు. సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు తన జూమ్ యాప్ ద్వారా కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించిన వార్త కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే ఆంధ్రా రాష్ట్రం కంటే రాజకీయమే ఎక్కువ అయినట్లుగా రాజకీయ పార్టీల తీరు ఉంది. ఇక ఇతర పార్టీలు కూడా అవతరణను లైట్ తీసుకోవడం బాధాకరమే.
టాలీవుడ్ అంతేగా…?
ఇక ఏపీ అంటే టాలీవుడ్ సినీ తారలకు ఉన్న చిన్న చూపు మరో మారు బయటపడింది. జూన్ 2 తెలంగాణా ఆవిర్భావం అంటే మాత్రం ట్వీట్లు విరగబడి చేసిన సినీ పెద్దలు ఏపీ అవతరణ దినం అంటే మాత్రం ట్విట్టర్ మూసుకుని కూర్చోవడం కంటే వివక్ష వేరే ఉండదేమో. వీరంతా ఆంధ్రాకు చెందిన వారే. కానీ పొరుగు రాష్ట్రంలో సెటిల్ అయ్యారు. అక్కడి సర్కార్ కి కోపం వస్తుందేమోన్న భయంతో అలా చేశారా లేక మనకెందుకొచ్చిన గోల అనుకున్నారా అర్ధం కావడంలేదు. ఇక ఏపీలో సినీ స్టూడియోలకు భూములు కావాలి, ఇక్కడే అధికంగా థియేటర్లు ఉన్నాయి. వాటి నుంచి భారీ కలెక్షన్లు కావాలి. కానీ ఏపీ వరదల్లో కొట్టుకుపోతుంటే ఒక్క రూపాయి వరద సాయం ఇవ్వరు. ఇపుడైనా కనీసం ఏపీ బాగుండాలని ఒక ట్వీట్ వేయరు. మొత్తానికి జగన్ పట్ల, వైసీపీ పట్ల విద్వేషమా. ఏపీ అంటేనే పట్టని నిర్లక్ష్యమా అన్నది వారి నోటితో చెబితేనే బాగుంటుందేమో.

