అందరికీ ఇచ్చేశారుగా… ఇక మిగిలిందెవరు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపైనైనా విడతల వారీగా చేస్తారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తులు తలెత్తినా మరో విడతలో అడ్జస్ట్ చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపైనైనా విడతల వారీగా చేస్తారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తులు తలెత్తినా మరో విడతలో అడ్జస్ట్ చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపైనైనా విడతల వారీగా చేస్తారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తులు తలెత్తినా మరో విడతలో అడ్జస్ట్ చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. లేకుంటే కొత్త వారికి అవకాశమివ్వాలన్నా వారి గురించి పూర్తి స్థాయి సమాచారం సేకరించుకునే వెసులుబాటు చిక్కుతుంది. కొంతకాలం క్రితం చంద్రబాబు పార్టీ పార్లమెంటరీ ఇన్ ఛార్జిల నియామకం చేపట్టారు.
విడతల వారీగా……
అయితే ఈ నియామకంపై అనేక జిల్లాల్లో అసంతృప్తులు తలెత్తాయి. దీంతో తాజాగా ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపికను కూడా చంద్రబాబు చేశారు. జంబో జెట్ లాంటి పొలిట్ బ్యూరో లో మొత్తం 25 మంది సభ్యులను నియమించారు. సీనియర్ నేతలందరికీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, ఫారూక్, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి వంటి వారిని నియమించారు.
టీడీఎల్పీ కంటే పెద్దది…..
అంటే దాదాపు సీనియర్ నేతలందరికీ పొలిట్ బ్యూరోలో స్థానం దక్కినట్లే. పొలిట్ బ్యూరో సమావేశం శాసనసభ పక్ష సమావేశం కన్నా పెద్దదిగానే ఉండనుంది. ఇక మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించాలని చంద్రబాబు భావించినట్లుంది. అందుకే కొత్తగా సెంట్రల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ కమిటీ విధివిధానాలు ఏదో తెలియకపోయినా మొత్తం మీద పెద్ద పేరే పెట్టడంతో ఇందులో నియమాకం అయిన వారు తృప్తి పడే అవకాశముంది.
రాష్ట్ర కమిటీ వాయిదా…..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించారు. అయితే రాష్ట్ర కమిటీని మాత్రం చంద్రబాబు మళ్లీ వాయిదా వేశారు. మరో వారం రోజుల్లో ఈ కమిటీని చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. ఇప్పుడు ప్రకటించిన దానిలో పదవులు దక్కని వారు అసంతృప్తి చెందితే రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మొత్తం మీద యాక్టివ్ గా పార్టీలో ఉన్నవారందరికీ పదవులు పందేరాన్ని చంద్రబాబు పూర్తి చేశారు. మరి ఈ పదవులతోనైనా తమ్ముళ్లు పార్టీని పరుగులు తీయిస్తారా? లేదా? అన్నది చూడాలి.

